పద్మశ్రీ అందుకున్న కీరవాణి, గర్వంగా ఉందంటూ.. ఎస్ ఎస్ రాజమౌళి ట్వీట్..

Published : Apr 06, 2023, 02:50 PM IST
పద్మశ్రీ అందుకున్న కీరవాణి, గర్వంగా ఉందంటూ..  ఎస్ ఎస్  రాజమౌళి ట్వీట్..

సారాంశం

టాలీవుడ్‌ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో ఎగరవేసి.. ఆస్కార్ సాధించిన సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి.  తాజాగా కీరవాణి  పద్మశ్రీ  అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కీరవాణి పద్మశ్రీ పురస్కారం తీసుకున్నాడు.


ఆర్ ఆర్ ఆర్ సినిమాతో టాలీవుడ్‌  జెండాను హాలీవుడ్ లో ఎగరేశారు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి. మన సినిమాను  ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లిన కీరవాణికి కేంద్రం పద్మశ్రీ ప్రకటించగా..  తాజాగా ఆ అవార్డ్ ను  అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కీరవాణి పద్మశ్రీ పురస్కారం తీసుకున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవం బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేశారు. 

ఇక కీరవాణితో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి  అవార్డ్ అందుకున్నవారిలో త్రియండి చినజీయర్‌ స్వామి కూడా ఉన్నారు. ఈయన  పద్మభూషణ్‌ అందుకున్నాడు. ఇక  కీరవాణి పద్మశ్రీ అందుకోవడంతో దర్శకుడు  ఎస్ ఎస్  రాజమౌళి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన  సంతోషం వ్యక్తం చేశాడు. పెద్దన్నను చూస్తుంటే గర్వంగా ఉందంటూ కీరవాణితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు జక్కన్న. ప్రస్తుతం ఈ ట్వీట్‌  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

 

ఇక రాజమౌళి ట్వీట్ కు నెటిజన్లు వరుసగాస్పందిస్తున్నారు. ఇద్దరు పద్మాఅవార్డ్ గ్రహీతలు ఒక ఫ్రేమ్ లో అంటూ కామెంట్స్ చేస్తున్నార  నాటు నాటు పాటతో కీరవాణి టాలీవుడ్‌ సినిమాను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లాడు. తన పాటతో విదేశీయులతో స్టెప్పులు వేయించాడు. మొదటి సారి తెలుగు సినిమాకు ఆస్కార్ ను తీసుకువచ్చారు కీరవాణి.  ఆస్కార్‌ను గెలిచి.. టాలీవుడ్‌ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టాడు. ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ తో పాటు గోల్డెన్‌ గ్లోబ్ అవార్డ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డ్ కూడా సాధించింది. 

PREV
click me!

Recommended Stories

Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో
Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. కప్‌ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన