బలగం వేణుకి మరోసారి అవకాశం ఇచ్చిన దిల్ రాజు...

Published : Apr 06, 2023, 01:59 PM IST
బలగం వేణుకి మరోసారి అవకాశం ఇచ్చిన దిల్ రాజు...

సారాంశం

బలగం సినిమాతో తన బలం ఎంతో నిరూపించాడు కమెడిన్ వేణు. ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసినా.. ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుడిమాదిరిగా చెలరేగిపోయాడు వేణు. ఇక ఈసినిమాతో నిర్మాత దిల్ రాజు దిల్ ను గెలిచిన వేణు.. ఆయన ప్రొడక్షన్ లోనే మరో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. 

 దిల్ రాజు నిర్మించిన మున్నా సినిమాతోనే  కమెడియన్ గా వెండితెరకు పరిచయం అయ్యాడు వేణు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంట..  హాస్య నటుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన వ్యక్తి వేణు. ఆ సినిమాలో పోషించిన టిల్లు పాత్రతో..  వేణు టిల్లుగా పేరు తెచ్చుకున్నాడు. జబర్థస్త్ షోతో పాపులర్ అయ్యాడు వేణు. కామెడీ రోల్స్ చేస్తూ.. సైలెంట్ గా దర్శకుడి అవతారం ఎత్తాడు. అనూహ్యంగా దర్శకుడిగా మారిన వేణు తీసిన ఫస్ట్ మూవీ బలగం. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది.  అచ్చ మైన తెలంగాణ పల్లెలో వాతావరణం, ప్రజల మానవ సంబంధాల మధ్య జరిగే కథతో  బలగం తెరకెక్కింది. 

మన పక్కింట్లో ఏం జరుగుతుంది.. ఎదురింటి గొడవలు.. పంచాయితీలో పెద్దల మాట, కుటుంబంలో అన్నదముమలు మధ్య గొడవలు.. ఇలాంటి సన్నివేశాలతో.. ఏమాత్రం కృత్రిమత్వం లేకుండా.. సహజసిద్థంగా సినిమా చేసి చూపించాడు వేణు. ఈసినిమాలో సెంటిమెంట్ తో.. ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాడు. తెలంగాణ సంస్కృతి, పల్లె  గురించి అద్భుతంగా బలగాన్ని తెరకెక్కించిన వేణు అందరినీ ఆశ్చర్య పరిచాడు. 

ఈ భారీ హిట్ తర్వాత వేణు నెక్ట్స్ సినిమాపై అప్పుడు డిస్కర్షన్స్ స్టార్ట్ అయ్యాయి.  ఇక ఈ విషయంలో స్పందించాడు కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు. తన రెండో సినిమా కూడా అందరూ ఊహించినట్టే..  కచ్చితంగా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని స్పష్టం చేశాడు.  ఇప్పటికే రాజుకు ఓ కథ కూడా చెప్పానని అంటున్నాడు వేణు. దానికి దిల్ రాజు కొన్ని మార్పులు..  సూచనలు చేశారన్నారు.  అవి తనకు కొత్త కిక్ ఇచ్చాయని  ఆ మార్పులు చేర్పులు తరువాత మరోసారి దిల్ రాజును కలిసి కథ వివరించి.. సినిమా ఫిక్స్ చేసుకుంటానన్నారు. 

ప్రస్తుతం బలగం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు వేణు అండ్ టీమ్. పార్టీలు చేసుకుంటున్నారు. అంతే కాదు ఇండస్ట్రీ పెద్దలు కూడా సినిమా చూసి వేణ అండ్ టీమ్ ను మెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పిలిపించుకుని వేణుతో సహా మేయిన్ టీమ్ ను సన్మానించారు. ఇక మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కూడా సినిమా చూసి.. ఎమోషనల్ ఫీల్ అయ్యి.. టీమ్ ను ఇంటికి పిలిచి సన్మానించి పంపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది బలగం సినిమా. ఇక వేణు కూడా ఇటు దర్శకుడిగా.. అటు నటుడిగా కూడా కొనసాగుతానంటున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి