దిల్ రాజు మాటలు విని ..పవన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్

Published : Apr 06, 2023, 01:55 PM IST
 దిల్ రాజు మాటలు విని ..పవన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్

సారాంశం

శంకర్ గారు గేమ్ ఛేంజర్ కథను 45 నిముషాలు పాటు నేరేట్ చేసారు. అయితే ఆయన మొదట ఈ కథలో పవన్ కళ్యాణ్ హీరో అనుకుని వచ్చారు


రాంచరణ్  ప్రస్తుతం షూటింగ్ కు  బ్రేక్ తీసుకుని తన వైఫ్ ఉపాసనతో కలిసి  జాలీగా గడుపుతున్నాడు.  ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాతగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ ఈ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి దిల్ రాజు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

‘శంకర్ గారు వచ్చి దాదాపు 45 నిమిషాల పాటు నాకు స్టోరీ నెరేట్ చేశారు. ఎవరినీ హీరోగా అనుకుంటున్నారని అడిగితే ఆయన పవన్ కల్యాణ్ పేరు చెప్పారు. ఈ స్టోరీకి పవన్ కంటే రాంచరణ్ బాగా సూట్ అవుతారని నేను చెప్పాను. అప్పుడు రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూట్ లో ఫిల్మ్ సిటీలో ఉన్నారు. అప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి ఇలా శంకర్ గారు లైన్ చెప్పారు బాగుంది.. చరణ్ నువ్వు విను నీకు బాగుంటుంది అని చెప్పాను. దీనికి ఒప్పుకొన్న శంకర్.. ఆ తర్వాత చరణ్ కు స్టోరీ ఫోన్ లో  చెప్పారు. ఆ తర్వాత నేను  రామ్ చరణ్ తో డిస్కస్ చేసాను. ఆయన నచ్చింది అన్నారు. దాంతో శంకర్ కు ఫోన్ చేసి..చరణ్ గారికి నచ్చింది...ఇట్స్ ఓవర్ ప్రాజెక్టు లాక్ అన్నాను అలా ఈ సినిమా ఓకే అయింది’ అని దిల్ రాజు తాజాగా ఓ మీడియా సంస్దకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

అయితే ఈ విషయం విన్న   డిసప్పాయింట్ అవుతున్నారు. ఒకవేళ ఈ మూవీ పవన్ చేసి, అది ఎలక్షన్ టైంలో రిలీజై ఉంటే రచ్చ వేరే లెవల్ ఉండేదని పోస్ట్ లు పెడుతున్నారు. మరికొందరు అయితే ఇందులో పెద్ద బాధపడేది ఏముంది వేరే క్యాంప్ కు వెళ్లలేదు కదా.... బాబాయి చేయాల్సిన మూవీలో అబ్బాయి చేస్తున్నాడు కదా అని హ్యాపీగా ఫీలవుతున్నారు.  

పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కియారా అద్వానీ ఫిమేల్ లీడ్. అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కు థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేశారు.  . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు(Dil Raju) ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండ‌గా.. ఎస్.ఎస్. థమన్ స్వ‌రాలు అందిస్తున్నాడు. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఇప్ప‌టికే స‌గానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. డైరెక్ట‌ర్ శంక‌ర్(Director Shankar) ఓవైపు `ఇండియాన్ 2` షూటింగ్ ను కానిస్తూనే.. మ‌రోవైపు గేమ్ ఛేంజ‌ర్ ను కంప్లీట్ చేస్తున్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి