ఓపల్‌ సుచాతని మిస్‌ వరల్డ్ 2025 విజేతగా నిలిపిన ప్రశ్న ఇదే, ఆమె సమాధానం మాత్రం హార్ట్ టచ్చింగ్‌

Published : Jun 01, 2025, 12:20 AM ISTUpdated : Jun 01, 2025, 12:23 AM IST
miss world 2025 winner opal suchata chuangsri

సారాంశం

మిస్‌ వరల్డ్ 2025 విజేతగా నిలిచిన థాయిలాండ్ అందగత్తె ఓపల్‌ సుచాత చువాంగ్‌శ్రీకి ఫైనల్‌లో ఎదురైన ప్రశ్న ఏంటి? దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటో ఇందులో చూద్దాం.

మిస్‌ వరల్డ్ 2025 విన్నర్‌ గా థాయిలాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ నిలిచి చరిత్ర సృష్టించింది. థాయిలాండ్‌ దేశం నుంచి మిస్‌ వరల్డ్ కిరీటం గెలిచిన తొలి అమ్మాయిగా రికార్డు క్రియేట్‌ చేసింది.

 ఇప్పుడు ప్రపంచ స్థాయి సెలబ్రిటీ అయిపోయింది. ఈ దెబ్బతో ఓపల్‌ సుచాత లైఫ్‌ మారిపోయిందని చెప్పొచ్చు. ఇక లైఫ్‌ సెట్‌ అయినట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మిస్‌ వరల్డ్ 2025 విన్నర్‌గా థాయిలాండ్‌ అందగత్తె ఓపల్‌ సుచాత 

మరి ఓపల్‌ సుచాతని విన్నర్‌గా నిలిపిన అంశాలేంటి? అనేది చూస్తే, ఆమె అందం, ఆత్మస్థైర్యం. ధైర్యం, నమ్మకం, సమాజం పట్ల ఉన్న బాధ్యత, సహాయం చేయాలనే గుణం ఇవన్నీ కారణం కావచ్చు. కానీ అంతిమంగా ఆమెని విజేతగా నిలిపింది మాత్రం ఒక ప్రశ్న, దానికి ఆమె సమాధానమే కారణమని చెప్పొచ్చు.

108 మంది అందగత్తెలు పాల్గొన్న ఈ మిస్‌ వరల్డ్ 2025 అందాల పోటీల్లో ఓపల్‌ సుచాత టాప్‌ 40లో స్థానం సంపాదించింది. ఆ తర్వాత టాప్‌ 20గా నిలిచింది. వారిలో నుంచి టాప్‌ 8 స్థానం సొంతం చేసుకుంది. అందులోనూ టాప్‌ 4గా నిలిచింది. 

ఫైనల్‌లో ఓపల్‌ సుచాతకి ఫైనల్‌లో సోనూ సూద్‌ అడిగిన ప్రశ్న ఇదే

టాప్‌ 4లో అమెరికా నుంచి మార్టినిక్యూకి చెందిన ఆరెల్లె జావోచిమ్‌, యూరప్‌ నుంచి పోలాండ్‌కి చెందిన మజా లడ్జా, ఆఫ్రికా నుంచి ఇథియోపియాకి చెందిన హస్సెట్‌ డీరెజె అడ్మస్సు, ఆసియానుంచి థాయిలాండ్‌కి చెందిన ఓపల్ సుచాత చువాంగ్‌ శ్రీ ఉన్నారు. వీరిలో ఒకరిని విన్నర్‌గా నిలిపేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రశ్న ఎదురయ్యింది.

అందులో భాగంగా ఓపల్‌ సుచాతకి జడ్జ్ గా ఉన్నా సోనూసూద్‌ ప్రశ్న వేశారు. నిజానికి సంబంధించి, వ్యక్తిగత బాధ్యతకి సంబంధించి కథలను రూపొందించడానికి ఈ జర్నీ మీకు ఏం నేర్పించింది? అన్ని ప్రశ్నించారు సోనూసూద్‌. 

దీనికి ఓపల్ స్పందిస్తూ, ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు తెలిపింది. అదే సమయంలో తాను ఇక్కడ(మిస్‌ వరల్డ్ స్టేజ్ పై) ఉండటం జీవితంలో లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు వెల్లడించింది.

మిస్‌ వరల్డ్ 2025 విన్నర్‌ ఓపల్‌ సుచాత విన్నింగ్‌ అన్సర్‌

`మిస్‌ వరల్డ్ లో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే పర్యాటకులను ఆకర్షించే బాధ్యత. ఇక్కడ మనం చేయగలిగే ఒక పెద్ద విషయం ఏంటంటే.. నేను గానీ, ఇక్కడ ఉన్న అమ్మాయిలుగానీ, ఈ హాల్‌లో ఉన్న అమ్మాయిలంతా మనం మన జీవితంలో అందరిచేత గౌరవంగా చూసే వ్యక్తిగా ఉండటం. 

ఎందుకంటే మీరు ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద వారైనా కావచ్చు, మీ జీవితంలో మీరు ఏ బిరుదైనా కలిగి ఉండవచ్చు, ఎవరికైనా మీ పక్కన ఒక వ్యక్తి ఉంటాడని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. 

అది పిల్లవాడైనా, పెద్దవాడైనా, ఒక విధంగా మిమ్మల్ని గౌరవంగా చూసే మీ సొంత తల్లిదండ్రులైనా కావచ్చు. ప్రజలను ముందుకు నడిపించడానికి మనం ఎల్లప్పుడు దయతో ఉండటం. మన చుట్టూ ఉన్న వాళ్లకి మనం చేయగలిగే ఉత్తమమైన పని అదే అని  భావిస్తా` అని తెలిపింది సుచాత.

సుచాతలోని ప్రాక్టికల్‌ నెస్‌, ఆమె సేవాభావం, సమాజంపై బాధ్యత, సాయం చేయాలనే గుణం వంటివి ఆమెని విన్నర్‌గా నిలిపాయి. ఆమె చెప్పిన సమాధానం అందరి హృదయాలను టచ్‌ చేసింది. దీంతో  ఇప్పుడు మిస్‌ వరల్డ్ 2025 విన్నర్‌ చెప్పిన సమాధానం వైరల్‌గా మారుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?