మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. మే 10 న హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా ప్రారంభం కానున్నాయి. శనివారం రోజు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అవుతాయి.
మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. మే 10 న హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా ప్రారంభం కానున్నాయి. శనివారం రోజు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే వివిధ దేశాల నుంచి అందమైన మోడల్స్ హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం 116 దేశాలకి సంబంధించిన కంటెస్టెంట్స్ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనబోతున్నారు.
ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు మిస్ వరల్డ్ పోటీలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెలు ముందుగా రెండు బృందాలుగా విడిపోయి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తారు. తెలంగాణ సంస్కృతి, కట్టడాలు, చరిత్ర గురించి వారికి పరిచయం ఉంటుంది.
దీనితో తెలంగాణ టూరిజంకి ప్రచారం కల్పించుకునేందుకు ఇది మంచి అవకాశం అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఒక విషయంలో నెటిజన్లు మిస్ వరల్డ్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. మిస్ వరల్డ్ వెబ్ సైట్ లో లోగో పైన 'తెలంగాణ జరూర్ ఆనా' అని ఉంది. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ తెలుగు భాషని ప్రమోట్ చేయకుండా ఉర్దూని ఉపయోగించడం ఏంటి అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలు 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయట. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న అందగత్తెలు రిహార్సల్స్ ప్రారంభిచారు. 2024 మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న క్రిస్టినా పిస్కోవా కూడా హైదరాబాద్ చేరుకుంది. ఆమెకి అధికారుల నుంచి ఘనస్వాగతం లభించింది.