Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల వల్ల హైదరాబాద్ కి ఇన్ని ప్రయోజనాలా, రూపురేఖలు మారిపోతాయా ?

Published : Jun 01, 2025, 07:32 AM ISTUpdated : Jun 01, 2025, 04:10 PM IST
CM Revanth Reddy

సారాంశం

స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై అనేక సమీక్షలు నిర్వహించి అధికారులని పరుగులు పెట్టించారు. ప్రభుత్వం ఇంతలా మిస్ వరల్డ్ పోటీలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించినప్పుడు.. హైదరాబాద్ కి కూడా ఏదో విధంగా ఉపయోగం ఉండాలి.

విజయవంతంగా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ 

మే 31 రాత్రి మిస్ వరల్డ్ 2025 పోటీలు ఘనంగా ముగిశాయి. థాయిలాండ్ కి చెందిన 21 ఏళ్ళ బ్యూటీ ఓపల్ సుచాత మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా మూడవసారి ఆతిథ్యం ఇచ్చింది. తొలిసారి హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ పోటీలు ఎలాంటి ఆటంకం లేకుండా గ్రాండ్ గా జరిగేలా చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతం అయింది. 

పరుగులు పెట్టించిన సీఎం రేవంత్ రెడ్డి 

స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై అనేక సమీక్షలు నిర్వహించి అధికారులని పరుగులు పెట్టించారు. మొత్తంగా మిస్ వరల్డ్ 2025 సంబరం హైదరాబాద్ లో ముగిసింది. ప్రభుత్వం ఇంతలా మిస్ వరల్డ్ పోటీలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించినప్పుడు.. హైదరాబాద్ కి కూడా ఏదో విధంగా ఉపయోగం ఉండాలి. అసలు మిస్ వరల్డ్ పోటీలని ఇక్కడ నిర్వహించడం వల్ల హైదరాబాద్ కి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలని ఈ కథనంలో తెలుసుకుందాం. 

మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌కు అనేక ప్రయోజనాలు తీసుకువస్తాయి. ఈ పోటీలు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయి, స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరుగుతుంది. హైదరాబాద్ కి సుందరమైన ఒక ప్రత్యేక నగరంగా ప్రపంచ దేశాలలో గుర్తింపు దక్కుతుంది. 

హైదరాబాద్ కి కలిగే ప్రయోజనాలు 

పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది:

మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను హైదరాబాద్‌కు ఆకర్షించాయి, ఇది నగరానికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. పర్యాటక రంగం పెరిగితే డెవలప్ మెంట్ కూడా మరింతగా పెరుగుతుంది.

స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది:

ఈ పోటీల నిర్వహణ వల్ల పర్యాటక రంగంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారత దేశంలో టూరిజం రంగంలో హైదరాబాద్ కి ప్రత్యేక స్థానం ఉంది. టూరిజంని నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది జీవనం సాగిస్తున్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ టూరిజంలో అవకాశాలని మరింతగా పెంచాయి. 

ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ కి బ్రాండ్ ఇమేజ్:

ఈ పోటీలు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం యొక్క సంస్కృతి, చరిత్ర, అందాలను ప్రపంచానికి తెలియజేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా నగరానికి సరికొత్త బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది.

హైదరాబాద్‌లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది:

ఈ పోటీలు హైదరాబాద్‌లో పెట్టుబడులను ప్రోత్సహించటానికి, నగర అభివృద్ధికి దోహదపడతాయి. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్ గురించి ఆరా తీసే అవకాశం ఉంది. వాళ్ళు ఈ నగరం గురించి తెలుసుకున్నప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతారు. 

మిస్ వరల్డ్ పోటీలు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు, పర్యాటక రంగ అభివృద్ధికి సహాయపడతాయి.

మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో విజయవంతం అయ్యాయి. కాబట్టి మరిన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఈ నగరానికి దక్కవచ్చు.  ఈ విధంగా, మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నిర్మాత కూతురి పెళ్లి వేడుకలో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్