
టాలీవుడ్ స్వీటి.. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి జంటగా `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ హోం బ్యానర్ యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్‌బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టితో కలిసి నటించడం ఈ ఇంట్రెస్ట్ కి కారణం. పైగా ఇప్పటికే విడుదలైన టీజర్ మరింత ఆసక్తిని పెంచింది. ఆద్యంతం కామెడీగా ఈ టీజర్ సాగడం విశేషం.
దీంతో సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ని ఇచ్చింది యూనిట్. ఆగస్ట్ 4న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడిచింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతుండటం విశేషం. అనుష్క ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లో `భాగమతి` చిత్రం చేసింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది.
నిర్మాతలు చెబుతూ, `భాగమతి` తర్వాత మా బ్యానర్‌లో అనుష్కతో `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా ప్రకటించినప్పట్నుంచి ఆడియెన్న్ నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగినట్లు దీన్నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు సాంగ్స్ కి ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అందులో ఓ పాటను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాడటం విశేషం.
సినిమాలో అనుష్క.. అన్విత రవళి శెట్టి పాత్రలో షెఫ్‌గా కనిపించనుంది. స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు మనసులను హత్తుకునేలా రూపొందించారు. ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే హార్ట్ టచ్చింగ్‌గా ఉంటాయి. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను గమనిస్తే.. అందులోనూ హీరో హీరోయిన్లు ఉన్నారు. ఓ ప్లెజంట్ ఫీలింగ్ ఇచ్చేలా పోస్టర్ ఉంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఆడియెన్స్ ని అలరించేందుకు రాబోతుంది. కచ్చితంగా ఆది మంచి ఆదరణ పొందుతుందని, ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నాం` అని తెలిపారు.
ఇక ఈ సినిమాకి రథన్ సంగీతం అందిస్తున్నాఉ. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా, రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా, రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, రాఘవ్ తమ్మారెడ్డి వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్‌గా పని చేస్తున్నారు.