`మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` ట్రైలర్‌.. అనుష్క, నవీన్‌ రచ్చ నెక్ట్స్ లెవల్‌

Published : Aug 21, 2023, 07:04 PM IST
`మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` ట్రైలర్‌.. అనుష్క, నవీన్‌ రచ్చ నెక్ట్స్ లెవల్‌

సారాంశం

`మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది.  తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. ఆద్యంతం కామెడీ ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. ఇందులో నవీన్‌, అనుష్కలు చేసిన రచ్చ హైలైట్‌గా నిలిచింది.

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కలిసి `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. టాప్‌ హీరోయిన్‌ అనుష్క, కుర్ర హీరో నవీన్‌ పొలిశెల్లి హీరోగా కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది. పాటలు సైతం అలరించాయి. 

తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. ఆద్యంతం కామెడీ ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. నవీన్‌ పొలిశెట్టి అల్లరి, అనుష్క ప్రేమ కోసం ఆయన పడే పాట్లు, ఇన్నోసెంట్‌ యాక్టింగ్‌తో చేసే ఫన్‌ ఆద్యంతం అలరిస్తుంది. `స్టాండప్‌ కమెడియన్‌ కావాలంటే ఇంజనీరింగ్‌ చేయాలా అని అనుష్క అడగడం, చెఫ్‌ కావాలంటే ఇంజనీరింగ్‌ చేయలేదా? అని నవీన్‌ అడగడం, ఆ తర్వాత అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే  అందంగా, పొడువుగా ఉండాలని, అదే అబ్బాయిలకు పెళ్లి కావాలంటే అమ్మాయి అయితే సరిపోతుందని నవీన్‌ చెప్పే డైలాగులు, దీంతోపాటు పిల్లలు కనాలంటే ప్రెగ్నెంట్‌ అయితే సరిపోతుందని, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అనుష్క చెప్పడం, ఆ తర్వాత ప్రెగ్నెంట్‌ కావడం కోసం నవీన్‌ వెంటపడటం ఈ క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించేలా ఉన్నాయి. 

ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతుంది. మినిమమ్‌ గ్యారంటీ అనే ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. ఇటీవల యాక్షన్‌ మూవీస్‌, థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్‌టైనర్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. విజయాలు సాధిస్తున్నాయి. `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకునే సినిమా అవుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. పైగా చాలా రోజులు తర్వాత అనుష్క శెట్టి నటిస్తున్న సినిమా కావడంతో ఒకింత ఆసక్తి ఏర్పడింది. 

దీనికితోడు `జాతిరత్నాలు` వంటి కామెడీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నవీన్‌ పొలిశెట్టి హీరోగా వస్తోన్న మూవీ కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల కాబోతుంది. సెప్టెంబర్‌ 7న సినిమాని రిలీజ్‌ చేయబోతున్నారు. మరి ఏ రేంజ్‌లో అలరిస్తారో చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌