బంపర్ ఆఫర్ కొట్టేసిన అదితి శంకర్. స్టార్ హీరో జోడీగా స్టార్ డైరక్టర్ వారసురాలు.

Published : Aug 21, 2023, 05:56 PM IST
బంపర్ ఆఫర్ కొట్టేసిన అదితి శంకర్. స్టార్ హీరో జోడీగా స్టార్ డైరక్టర్ వారసురాలు.

సారాంశం

నటిగా దూసుకుపోతోంది డైరెక్టర్ శంకర్ తనయురాలు అదితి శంకర్. చేసిని సినిమాలు తక్కువే అయినా.. సక్సెస్ రేట్ తో అదరగోడుతుంది. తాజగా ఆమె బంపర్ ఆఫర్ సాధించినట్టు తెలుస్తోంది. 

స్టార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. సొంత కాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేస్తుంది అదితీ శంకర్. దిగ్గజ దర్శకుడు శంకర్‌ వారసురాలు అదితి తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానం సాధిచండమే లక్ష్యంగా దూసుకుపోతోంది.  ఇప్పటికి ఆమె చేసింది రెండు సినిమాలే... కానీ ఆ రెండు  సూపర్ హిట్ అయ్యాయి.  ఏడాది కిందట కార్తితో విరుమన్‌ సినిమా చేసి నటిగా తొలి సినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది అదితీ శంకర్.  ఇక రీసెంట్ గా మహవీరుడుతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది బ్యూటీ. ఈ సినిమా తెలుగులో కూడా మహావీరుడుగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. 

ప్రస్తుతం అదితి శంకర్‌కు సబంధించిన  రెండు సినిమాలను సెట్స్‌ మీద ఉన్నాయి. అందులో ఒకటి షూటింగ్‌ దశలో ఉండగా.. మరోటి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఓ బంపర్ ఆఫర్‌ తగిలినట్లు తెలుస్తుంది.ఆకాశం నీ హద్దురా సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన  టీమ్ మరోసారి క్రేజీ ప్రాజెక్ట్‌ కోసం చేతులు కలుపుతున్నారు. కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా అదితిశంకర్‌ నటించబోతున్నట్లు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిశాయట. దాదాపు సూర్య జోడీగా అదితీ ఫిక్స్ అంటున్నారు. 

సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జీ.వి ప్రకాష్‌ కుమార్‌ మ్యూజిక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  ఇక సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో తో బిజీగా ఉన్నాడు. శౌర్యం ఫేమ్‌ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో  తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వెట్రమారన్‌తో వడివాసాల్‌ చేయనున్నాడు. ఈ రెండు పూర్తయిన తర్వాత సుధా కొంగరతో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. కంగువా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇటు టాలీవుడ్ లో కూడా ఈసినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌