Mission Impossible: ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’OTT రిలీజ్ డేట్,అఫీషియల్

Surya Prakash   | Asianet News
Published : Apr 21, 2022, 11:00 AM IST
Mission Impossible: ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’OTT రిలీజ్ డేట్,అఫీషియల్

సారాంశం

 భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 1 రిలీజైన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ని ప్రేక్షకులుని ఏప్రియల్ ఫూల్స్ ని చేసింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.


ఇరవై రోజుల  క్రితం  భారీ ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ఈ చిత్రం భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు.  చాలాకాలం తర్వాత తాప్సీ పన్ను తెలుగులో ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.రిలీజ్ కు ముందు విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 1 రిలీజైన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ని ప్రేక్షకులుని ఏప్రియల్ ఫూల్స్ ని చేసింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఈ చిత్రం నెట్ ప్లిక్స్ లో ఏప్రియల్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియోటర్ రిలీజ్ నుంచి కరెక్ట్ గా నాలుగు వారాలు ఆగి ఓటిటి కు ఇచ్చారు. ఈ సినిమాని థియోటర్ లో జనం పెద్దగా చూడలేదు కాబట్టి ఓటిటిలో చూసే అవకాసం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా నెట్ ప్లిక్స్ చేయనుంది.

చిత్రం కథేమిటంటే...రఘుపతి (హార్ష్ రోషన్), రాఘవ (భాను ప్రకాష్), రాజారామ్ (జయతీర్థ మొలుగు) స్నేహితులు. ముగ్గురిదీ తిరుపతి దగ్గరలోని వడమాల పేట. దర్శకుడు కావాలనేది రఘుపతి కల. 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో కోటి రూపాయలు గెలవాలనేది రాఘవ లక్ష్యం. మలింగ అంత ఫాస్ట్ బౌలర్ అవ్వాలని రాజారామ్ ఆశ పడతాడు. ముగ్గురూ ఎంత అమాయకులు అంటే... దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటే పోలీసులు రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తారని తెలిసి, దావూద్‌ను పట్టుకోవడం కోసం ముంబై బయలు దేరతారు. కానీ, బెంగళూరులో చేరతారు. అక్కడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ శైలజ (తాప్సీ పన్ను)కు వీళ్ళు ఎలా కలిశారు? ఆ తర్వాత ఏమైంది? మంగళూరులో చైల్డ్ ట్రాఫికింగ్ కేసుకు, ఈ పిల్లలకు సంబంధం ఏమిటి? ముగ్గురు పిల్లలు ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఇక ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు వరకూ తాప్సీది గెస్ట్ రోల్ లా ఉంటుంది.  ఆ తర్వాత కూడా తక్కువసేపే కనిపించారు. కానీ, ఆమె పాత్ర  ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. హర్షవర్ధన్, సుహాస్, సందీప్ రాజ్, హరీష్ పేరడి సైతం అతిథి పాత్రల్లో కనిపించారు. రెండు మూడు సన్నివేశాలకు పరిమితం అయ్యారు. కథంతా చిన్న పిల్లల చుట్టూ తిరుగుతుంది. సినిమాకు అసలైన హీరోలు వాళ్ళే.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే