
రష్మిక ఇప్పుడు ఇతర హీరోయిన్స్ కుళ్లుకునే స్దాయిలో ఉంది. ఆమె వరస ప్రాజెక్టులు సైన్ చేసే పనిలో పడింది. ‘పుష్ప’ తో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిన ఆమె రీసెంట్ గా రెండు భారీ చిత్రాలకు సంతకం చేసింది. అవి రణబీర్ కపూర్ బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ కొత్త సినిమా. త్వరలో ఆమె 'పుష్ప 2' పనిని కూడా ప్రారంభించనుంది. అయితే అక్కడితో ఆమె ప్రస్దానానికి బ్రేక్ ఇవ్వదలుచుకోలేదు.
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కోసం ఆమెను మేకర్స్ సంప్రదించారు. అయితే ఫైనల్ డిస్కషన్స్ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఆ చిత్రం ఇప్పటివరకూ రష్మిక చేస్తున్న చిత్రాలకు భిన్నమైనదని చెప్తున్నారు. ఆ సినిమాతో రష్మిక నెక్ట్స్ లెవిల్ కు వెళ్లనుంది. అయితే ఆ ప్రాజెక్టు వివరాలు పూర్తిగా బయిటకు రాలేదు. ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాలు పై క్లారిటీ రానుందని సమాచారం.
ఇక తెలుగులో రష్మికా ఫుల్ బిజీ. పుష్ప2తో పాటూ దుల్కర్ సల్మాన్ – హను రాఘవపూడి ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది. ఇప్పుడు విజయ్ – వంశీ పైడిపల్లి – దిల్ రాజు ప్రాజెక్ట్ లో భాగమైంది. అదే సమయంలో 'పుష్ప' సక్సెస్ తర్వాత రష్మిక ఇటీవల తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. ఆమె ప్రస్తుత దశను ఆస్వాదిస్తోంది. రష్మిక పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్‌లు మరియు పాన్-ఇండియన్ సినిమాలలో భాగం కావాలని కోరుకుంటుంది, తద్వారా ఆమె గ్రాఫ్ మరింత ఎక్కువగా ఉంటుంది. మిడిల్ రేంజ్ ఎంటర్‌టైనర్‌లు చేయడానికి ఆమె ఇటీవల చేసిన ప్రయత్నం సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి చిత్రాలు వర్కవుట్ కాలేదు.