`కల్కి2898ఏడీ` మూవీ రన్‌ టైమ్‌ ఎంతో తెలుసా?.. పాన్‌ ఇండియా చిత్రాల్లో ఇదే తక్కువా?

Published : Jun 02, 2024, 10:59 PM IST
`కల్కి2898ఏడీ` మూవీ రన్‌ టైమ్‌ ఎంతో తెలుసా?.. పాన్‌ ఇండియా చిత్రాల్లో ఇదే తక్కువా?

సారాంశం

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` కోసం అంతా ఎదురుచూస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్‌ చేస్తున్నారు. తాజాగా నిడివికి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది.   

ప్రభాస్‌ గతేడాది `సలార్`తో హిట్‌ కొట్టారు. ఆ మూవీ ప్రభాస్‌ రేంజ్‌ని పరిచయం చేసింది. ఇప్పుడు మరో పాన్‌ ఇండియా మూవీ `కల్కి2898ఏడీ`తో వస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ లాంటి టాలెంటెడ్‌ దర్శకుడు రూపొందిస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలున్నాయి. అయితే ఆయన మైథలాజికల్‌ అంశాలను, సైన్స్ ఫిక్షన్‌కి ముడిపెట్టి ఈ సినిమా తెరకెక్కించడం ఇక్కడ విశేషంగా చెప్పాలి. సాధారణంగా ఇలాంటి జోనర్‌లో సినిమా చాలా అరుదు. మరి నాగ్‌ అశ్విన్‌ ఎలా డీల్‌ చేశాడనేది ఆసక్తికరం. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ వచ్చాయి. ప్రభాస్‌ నటిస్తున్న భైరవ పాత్రని పరిచయం చేశారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ పాత్రని, దీపికా పాత్రని రిలీజ్‌ చేశారు. ఇటీవల బుజ్జి ని కూడా పరిచయం చేశారు. బుజ్జి, భైరవ మధ్య అనుబంధం ఎలా ఉండబోతుందో తెలిపే ప్రయత్నం చేశారు. బుజ్జితోనే ప్రమోషన్‌ చేస్తున్నారు. దీంతోపాటు `కల్కి2898ఏడీ` యానిమేషన్‌ సిరీస్‌ని కూడా రిలీజ్‌ చేశారు. మొదటి ఎపిసోడ్‌ రిలీజ్‌ చేయగా, స్పందన బాగానే ఉంది. 

అయితే ఏం చేసినా ఈ మూవీకి బజ్‌ క్రియేట్‌ కావడం లేదు. కంటెంట్‌ పరంగా కిక్‌ ఇచ్చేది ఏదీ లేదు. బుజ్జి వాహనం బాగానే ఉన్నా, దానితో ఏం చేస్తారనేది పెద్ద డౌట్‌. యానిమేషన్‌ సిరీస్‌ సైతం ఏం కిక్‌ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా ఫలితం ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ కంటే అనుమానాలు ప్రారంభమయ్యాయి. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆశామాషీగా చేయడనే నమ్మకం అందరిలోనూ ఉంది. కానీ కంటెంట్‌ పరంగా అది కనిపించకపోవడంతో పెదవి విరిచే పరిస్థితి నెలకొంది. మరి మున్ముందు రాబోయే కంటెంట్‌ ఆ లోటుని తీరుస్తుందేమో చూడాలి. 

ఇదిలా ఉంటే ఈ మూవీ నిడివికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. సినిమా ఎంత రన్‌ టైమ్‌ ఉందో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా రన్‌ టైమ్‌ బయటకు వచ్చిందని తెలుస్తుంది. `కల్కి2898ఏడీ` రెండు గంటల 49 నిమిషాలు ఉండబోతుందట. ఇది చాలా డీసెంట్‌ రన్‌ టైమ్‌ అని చెప్పొచ్చు. అయితే ఇటీవల పాన్‌ ఇండియా చిత్రాలు, పెద్ద హీరోల సినిమాలన్నీ సుమారు మూడుగంటలు ఉంటున్నాయి. `పుష్ప` నుంచి ఈ ట్రెండ్‌ నడుస్తుంది. `యానిమల్‌` ఏకంగా మూడున్నర గంటలు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `కల్కి` నిడివి తక్కువే అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితేదీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `కల్కి2898ఏడీ` చిత్రంలో ప్రభాస్‌ భైరవ పాత్రలో నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌ అశ్వథ్థామ పాత్రలో కనిపిస్తారు. మిగిలిన పాత్రలు తెలియాల్సి ఉంది. ఇందులో బ్రహ్మానందం కూడా ఉండబోతున్నారు. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా చేస్తున్నారు. కమల్‌ హాసన్‌ నెగటివ్‌ రోల్‌లో మెరవబోతున్నారు. మరికొందరు స్టార్స్ గెస్ట్ లుగా మెరుస్తారని సమాచారం. అశ్వినీదత్‌ సుమారు 700కోట్లతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీన్ని ఈ నెల 27న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్