నోట్లో కండోమ్ పెట్టి నరకం చూపించాడు.!

Published : Jul 14, 2018, 10:26 AM IST
నోట్లో కండోమ్ పెట్టి నరకం చూపించాడు.!

సారాంశం

హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ క్యాస్టింగ్ కౌచ్ బాగోతం గురించి నటీమణులు ఒక్కొక్కరిగా బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. తమకు జరిగిన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడిస్తోస్తున్నారు. తన సినిమాల్లో అవకాశాల కోసం హార్వీ....16 ఏళ్ల అమ్మాయి మొదలుకొని 40 ఏళ్ల మహిళా ఆర్టిస్టుల వరకు ఎవరనీ వదలలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ క్యాస్టింగ్ కౌచ్ బాగోతం గురించి నటీమణులు ఒక్కొక్కరిగా బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. తమకు జరిగిన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడిస్తోస్తున్నారు. తన సినిమాల్లో అవకాశాల కోసం హార్వీ....16 ఏళ్ల అమ్మాయి మొదలుకొని 40 ఏళ్ల మహిళా ఆర్టిస్టుల వరకు ఎవరనీ వదలలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. హార్వీతోపాటు మరెంతో మంది దర్శకనిర్మాతలు తమను లైంగికంగా వేధించారంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో హార్వీ జైలుపాలయ్యాడు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటి - `లార్డ్ ఆఫ్ ది రింగ్స్` ఫేమ్ మిరా సోర్వినో తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు వెల్లడించారు. నోట్లో కండోమ్ పెట్టి.....తనతో హార్వీ అత్యంత కర్కశంగా వ్యవహరించాడని మిరా సంచలన ఆరోపణలు చేశారు.అపుడు తనకు పదహారేళ్లని - ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హార్వీ సినిమాలో అవకాశం వచ్చిందని మిరా తెలిపారు. అయితే తన లైంగికవాంఛ తీర్చాలని హార్వీ తనను అడిగాడని - అందుకు తాను అంగీకరించకపోవడంతో అక్కసు పెంచుకున్నాడని ఆరోపించారు. 

దానికి ప్రతీకారంగా షూటింగ్ లో తనను ఇబ్బందిపెట్టాడని చెప్పారు. ఓ సీన్ సందర్భంగా తాను భయపడాలని - అందుకోసం...తనను హార్వీ ఒక కుర్చీకి కట్టేసి...తన చేతులను మెలేశాడని చెప్పారు. తాను చిన్న పిల్లనని - అసలేం జరుగుతుందో తెలుసుకునే లోపే...తన నోట్లో కండోమ్ పెట్టి....మరింత భయపెట్టాడని తెలిపారు. ఆ తర్వాత కండోమ్ తీసివేసి....సారీ చెప్పాడని గుర్తుచేసుకున్నారు. తాను క్యాస్టింగ్ కౌచ్ కు ఒప్పుకోకపోవడంతో....హార్వీ తోపాటు చాలామంది దర్శకనిర్మాతలు తనను ఇబ్బందిపెట్టారని తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు