నంది అవార్డుల వివాదం.. దత్తుగారికి సుతిమెత్తగా మంత్రి తలసాని కౌంటర్

Published : May 04, 2023, 05:50 PM ISTUpdated : May 04, 2023, 05:51 PM IST
నంది అవార్డుల వివాదం.. దత్తుగారికి సుతిమెత్తగా మంత్రి తలసాని కౌంటర్

సారాంశం

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలతో సడెన్ గా తెలుగు రాష్ట్రలో నంది అవార్డుల వివాదం చెలరేగింది. ఓ ఇంటర్వ్యూలో అశ్విని దత్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉత్తమ గూండా, రౌడీ సీజన్ నడుస్తోంది. మనకి అవార్డులు ఇచ్చే సీజన్ త్వరలో వస్తుంది అని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలతో సడెన్ గా తెలుగు రాష్ట్రలో నంది అవార్డుల వివాదం చెలరేగింది. ఓ ఇంటర్వ్యూలో అశ్విని దత్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉత్తమ గూండా, రౌడీ సీజన్ నడుస్తోంది. మనకి అవార్డులు ఇచ్చే సీజన్ త్వరలో వస్తుంది అని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అశ్విని దత్ చేసిన ఈ కామెంట్స్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే అనే ప్రచారం జరుగుతోంది. 

ఈ క్రమంలో తెలంగాణాలో కూడా నంది అవార్డుల చర్చ మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నంది అవార్డుల ఊసే లేదు. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని స్పందిస్తూ.. గత కొంతకాలంగా నంది అవార్డుల ప్రస్తావన లేదు.. నిజమే.. అయితే నంది అవార్డుల విషయంలో తమని ఎవరూ సంప్రదించలేదు అని తలసాని అన్నారు. అయినప్పటికీ రానున్న రోజుల్లో నంది అవార్డుని తప్పకుండా ఇస్తాం అని తెలిపారు. 

మీడియా కనిపిస్తే కొందరు ఏది పడితే అది మాట్లాడడం సహజం. మీడియా ముఖంగా అడిగితే అవార్డులు ఇచ్చేయరు అంటూ తలసాని ఘాటుగా బదులిచ్చారు. చిత్ర పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేసిందని.. ఆ విషయాన్ని సినీ ప్రముఖులే అంగీకరిస్తున్నారని తలసాని అన్నారు. నంది అవార్డుల గురించి కూడా ఆలోచిస్తాం అని అన్నారు. 

వచ్చే ఏడాదే నంది అవార్డులకు ప్లాన్ చేస్తున్నట్లు తలసాని అన్నారు. ఇక అశ్విని దత్ కామెంట్స్ పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్, పోసాని లాంటి వాళ్ళు అశ్వినీదత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇది రాజకీయ వివాదం దిశగా వెళుతున్నట్లు అర్థం అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌