త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ నెక్స్ట్ ప్రాజెక్ట్ నుండి పూజా హెగ్డేను తప్పించారనే ప్రచారం జరుగుతుంది. సంయుక్త మీనన్ కి ఛాన్స్ ఇచ్చాడట.
దర్శకుడు త్రివిక్రమ్ మొదట్లో హీరోయిన్స్ ని రిపీట్ చేసేవాడు కాదు. అత్తారింటికి దారేది చిత్రం నుండి ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సమంతకు వరుసగా మూడు చిత్రాల్లో ఆఫర్ ఇచ్చాడు. అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అ ఆ చిత్రాల్లో సమంత మెయిన్ హీరోయిన్ గా చేసింది. సమంతను పక్కన పెట్టి పూజా హెగ్డేపై దృష్టి పెట్టారు. అరవింద సమేత వీరరాఘవతో మొదలైన వీరి కాంబినేషన్ కొనసాగుతుంది.
అలా వైకుంఠపురంలో పూజా హెగ్డేతో త్రివిక్రమ్ కి రెండో చిత్రం. చిత్రీకరణ దశలో ఉన్న ఎస్ఎస్ఎంబి 28తో హ్యాట్రిక్ పూర్తి చేయబోతున్నారు. పూజాతో త్రివిక్రమ్ కి ఇదే చివరి చిత్రమన్న మాట వినిపిస్తోంది. పూజా హెగ్డే వరుస ప్లాప్స్ తో ఫార్మ్ కోల్పోవడంతో పాటు మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ అంటే త్రివిక్రమ్ మక్కువ చూపిస్తున్నారట. హిట్టు మీద హిట్టు కొడుతున్న ఆమెతో పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారట.
మహేష్ మూవీ అనంతరం అల్లు అర్జున్ తో ఒక చిత్రం చేయబోతుండగా... అందులో సంయుక్త మీనన్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఒక వేళ అల్లు అర్జున్ మూవీ డిలే అయినా త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీలో సంయుక్తనే హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. పరాజయాల్లో ఉన్న పూజాకు త్రివిక్రమ్ డెసిషన్ భారీగా నష్టం కలిగించేదే అంటున్నారు. అదే సమయంలో సంయుక్త మీనన్ పంట పడినట్లేనని అంచనా వేస్తున్నారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా త్రివిక్రమ్ కి స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇస్తారు. చెప్పాలంటే మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఆయన సన్నిహితులే. ఈ క్రమంలో సంయుక్త త్రివిక్రమ్ తెరకెక్కించే భవిష్యత్ ప్రాజెక్ట్స్ లో వరుసగా నటించే అవకాశం కలదు. సంయుక్త తెలుగులో నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. బింబిసార, విరూపాక్ష వీటిలో భారీ హిట్స్ అని చెప్పొచ్చు.