హీరో ప్రభాస్‌పై మంత్రి మల్లారెడ్డి సెటైర్లు.. సినిమా ఈవెంట్లో రచ్చ

Published : Mar 26, 2023, 01:58 PM ISTUpdated : Mar 26, 2023, 02:12 PM IST
హీరో ప్రభాస్‌పై మంత్రి మల్లారెడ్డి సెటైర్లు.. సినిమా ఈవెంట్లో రచ్చ

సారాంశం

తనదైన క్రేజీ స్పీచ్‌లతో ఫేమస్‌ అయ్యారు మంత్రి మల్లారెడ్డి. తాజాగా ఆయన `మేమ్‌ ఫేమస్‌` అనే సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇందులో ప్రభాస్‌పై ఆయన చేసిన కామెంట్లు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి.

తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తనదైన స్టయిల్‌లో బోల్డ్ గా లౌడ్‌గా మాట్లాడుతూ ఆకట్టుకుంటారు. నవ్వులు పూయిస్తుంటారు. తన మల్లారెడ్డి కాలేజీ ఈవెంట్లలోనే కాదు, అసెంబ్లీలోనూ ఆయన స్పీచ్‌ నవ్వులు పూయిస్తుంటుంది. తాజాగా ఆయన సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ మధ్య మేడే రోజు చిరంజీవి సమక్షంలో తనదైన స్పీచ్‌తో దద్దరిల్లేలా చేసిన మంత్రి మల్లారెడ్డి తాజాగా `మేమ్‌ ఫేమస్‌` అనే సినిమా టీజర్‌ ఈవెంట్‌లో రచ్చ చేశారు.  ఆదివారం జరిగిన ఈ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చిన మల్లారెడ్డి తనదైన స్పీచ్‌తో హోరెత్తించారు. 

ఇందులో భాగంగా సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే తన స్పీచ్‌ని కొనసాగించారు. ఫేమస్‌ గురించి వివరించారు. తాను ఇప్పుడు ఫేమస్‌ అని, అందుకు కారణం కష్టపడి వచ్చానని, పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, ఆస్పిటల్స్ పెట్టినా కష్టపడి పైకొచ్చా, ఇప్పుడు మినిస్టర్‌ అయ్యానని తెలిపారు. అయితే ఈ క్రమంలో `మేమ్‌ ఫేమస్‌` చిత్రంలో హీరోగా నటించిన సుమంత్‌ ప్రభాస్‌ని పొగుడుతూ ప్రభాస్‌ తో పోల్చుతూ ప్రశంసలు కురిపించారు.

సుమంత్‌ ప్రభాస్‌ ఇద్దరు హీరోల పేర్లు పెట్టుకున్నందుకు అభినందించిన మంత్రి చూడ్డానికి ప్రభాస్‌ కంటే అందంగా ఉన్నాడని తనదైన స్టయిల్‌లో ఆ కుర్ర హీరోని లేపాడు. అంతేకాదు ప్రభాస్‌ అంటే బోలెడు మేకప్‌ వేసుకుని ఉంటాడు, కానీ నువ్వు మేకప్‌ లేకుండానే స్మార్ట్ గా ఉన్నావ్డం కామెంట్ చేశాడు. దీంతో ఆడియెన్స్, ఫ్యాన్స్ అందరు హోరెత్తించారు.  తెలంగాణ బిడ్డ రేపు దుమ్ములేతడన్నారు. తెలంగాణ ప్రభాస్‌ అంటూ ఆ కుర్ర హీరోని లేపి పడేశాడు. దీంతో ఈవెంట్‌ మొత్తం నవ్వులతో, అరుపులతో హోరెత్తింది. అందరికంటే మీరే స్మార్ట్ ఉన్నారని హీరో అనగా, అదైతే నిజమే అంటూ తాను డెబ్బై ఏళ్ల ఏజ్‌లోనూ ఎనర్జిటిక్‌గా ఉన్నానని, స్మార్ట్ గా ఉన్నానని చెప్పడంతో ఏఎంబీ థియేటర్‌ మొత్తం అరుపులతో దద్దరిల్లింది.

ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి తనదైన స్టయిల్‌లోనే ఎప్పటిలాగే క్రేజీ స్పీచ్‌తో ఆద్యంతం అలరించారు. గాలి తిరుగుడు తిరగ కుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్లాలని, ఫేమస్‌ కావాలని, తనలాగే ఫేమస్‌ కావాలని తెలిపారు. ఈ ఏజ్‌లో ఎంజాయ్‌లకు పోతే లైఫ్‌ పోతుందన్నారు. ప్రస్తుతం ఆయన స్పీచ్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. మల్లారెడ్డి ఆద్యంతం కామెడీని పంచేలా ప్రసంగం సాగడం విశేషం. అయితే ప్రభాస్‌పై ఆయన నవ్వుతూ కామెంట్‌ చేసినా, డార్లింగ్‌ ఫ్యాన్స్ కి మాత్రం గుచ్చుకునేలా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఒకరిని లేపేందుకు ప్రభాస్‌పై ఇలాంటి కామెంట్లు చేస్తారా? అంటూ పెదవి విరుస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Harikrishna: ఆ శక్తి ఉంటే తప్పకుండా నందమూరి హరికృష్ణని బతికిస్తా.. ఎలాగో చెబుతూ కీరవాణి ఎమోషనల్ కామెంట్స్
Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌