భర్త రణ్ వీర్ సింగ్ ను పట్టించుకొని దీపికా పదుకొణె.. నెట్టింట వీడియో వైరల్.. వారిద్ధరి మధ్య ఏంజరిగింది?

By Asianet News  |  First Published Mar 26, 2023, 1:11 PM IST

కొద్దిరోజుల కింద బాలీవుడ్ క్రేజీ కపుల్ రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకొణె గొడవలపై వచ్చిన రూమర్లను స్టార్ జంట కొట్టిపారేశారు. కానీ తాజాగా వారిద్దరికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాల జోరు పెరుగుతున్న కొద్దీ దీపికా సైతం ఇండస్ట్రీలో అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వేడుకల్లోనూ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరవుతూ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంటున్నారు. గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫిపా వరల్డ్ కప్ ప్రజెంటర్ గా గౌరవం పొందారు. రీసెంట్ గా ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్స్ 95వ వేడుకల్లోనూ సందడి చేసింది. కేరీర్ పరంగా గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది. రీసెంట్ గా దీపికా ‘పఠాన్’తో బ్లాక్ బాస్టర్ ను సైతం అందుకుంది. 

అయితే, బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకొణె రొమాంటిక్ జంటగా గుర్తింపు పొందారు. ఆరేండ్ల ప్రేమాయణం తర్వాత 2018లో వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కారు. అప్పటి నుంచి నుంచి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. కేరీర్ లో బిజీగా ఉంటూనే.. ఇటు వివాహ బంధాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టూర్లు వేకేషన్స్ కు వెళ్తూ గతంలో సందడి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సినీ ఫంక్షన్లు, పార్టీలు, ఇతరత్రా  కార్యక్రమాలకు కూడా ఈ జంట కలిసి హాజరై అందరినీ ఆకట్టుకుంటుండటం తెలిసిందే.

Latest Videos

ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల కింద దీపికా పదుకొణె - రణ్ వీర్ సింగ్ మధ్య మనస్ఫార్థాలు ఏర్పడ్డాయని  త్వరలో విడిపోబోతున్నారని ఓ క్రిటిక్ ట్వీట్ చేశారు. దీంతో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. దీనిపై అప్పుడు రణ్ వీర్ సింగ్ స్పందిస్తూ.. అదంతా అవాస్తవమని, దీపికాపై తనకు మరింత ప్రేమ, అభిమానం పెరిగిందంటూ గతేడాది క్లారిటీ ఇచ్చారు. అటు దీపికా కూడా మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో తమకు ఒకరిపై మరొకరికి ఏమాత్రం ప్రేమ తగ్గలేదని చెప్పుకొచ్చింది. దీంతో ఆ రూమర్లకు అప్పుడు అడ్డుకట్ట పడింది. 

అది పూర్తై కొద్దిరోజులు గడిసిందో లేదో.. మళ్లీ అవే రూమర్లు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొణె - రణ్ వీర్ సింగ్ మధ్య ఏవో మనస్ఫార్థాలు ఉన్నాయంటున్నారు. ఇక రీసెంట్ గా ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కు రణవీర్ సింగ్ - దీపికా పదుకొణె కలిసే హాజరయ్యారు. కారు దిగి వేదికకు వెళ్తున్నసందర్భంలో దీపికా పదుకొణె రణ్ వీర్ ను ఏమాత్రం పట్టించుకోలేదు. కలిసి నడిచేందుకు చేయి ఇచ్చినా దీపికా చూసీచూడనట్టుగా ముందుకు వెళ్లింది. రణ్ వీర్ కు అస్సులు ఐకాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. ఆ సమయంలో రణ్ వీర్ కూడా కామ్ గానే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అయితే ఎప్పుడూ వీరిద్దరూ ఎలాంటి ఈవెంట్ కు హాజరైన చేతిలో చేయి వేసుకొని చాలా హుషారుగా కనిపించేవారు. వారి ప్రజెన్స్ ఆ కార్యక్రమానికే సందడిని తెచ్చేదిగా ఉండేది. కానీ అది ఈ వీడియోలో కనిపించకపోవడంతో రణ్ వీర్ - దీపికా మధ్య ఏం జరిగిందంటూ అభిమానులు ఖంగారు పడుతున్నారు. అయితే, వీడియో చూసిన కొందరు  నెటిజన్లు మాత్రం ‘ఆ క్షణంలో దీపికా రణ్ వీర్ పై కోపంగా ఉండి ఉంటుంది.. అందుకే అలా చేసిందేమో’నని అంటున్నారు. మరికొందరు మాత్రం ‘ఇద్దరి బాడీ లాంగ్వేజీ పూర్తిగా మారిపోయిందని.. ఒకరితో ఒకరి కలిసి నడిచేందుకు ఏమాత్రం ఇష్టం చూపించడం లేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

weird chemistry at event pic.twitter.com/cXO6RRRvYQ

— Harminder 🍿🎬🏏 (@Harmindarboxoff)
click me!