‘భోళా శంకర్’ నుంచి ‘మిల్క్ బ్యూటీ’.. అదిరిపోయిన ప్రోమో.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?

By Asianet News  |  First Published Jul 20, 2023, 8:18 PM IST

మెగాస్టార్ చిరంజీవి - తమన్నా భాటియా జంటగా వస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. వచ్చేనెలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం యూనిట్ వరుసగా అప్డేట్స్ అందిస్తోంది. ఈ క్రమంలో ‘మిల్కీ బ్యూటీ’ సాంగ్ ప్రోమోను విడుదల చేసి ఆకట్టుకుంది.
 


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - మెహర్ రమేశ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భోళా శంకర్’. రీసెంట్ గా షూటింగ్ పూర్తైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా యూనిట్ అటు చకాచకా ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తూనే ఇటు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ప్రమోషనల్ మెటీరియల్ ను వదులుతూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 

‘వాల్తేరు వీరయ్య’తో చిరు బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న Bholaa Shankar పై అంచనాలు పెరుగుతున్నాయి. ఆ మధ్యలో విడుదల చేసిన పోస్టర్ల విషయం కాస్తా నెగెటివ్ అందుకున్నా.. ప్రస్తుతం అందుతున్న అప్డేట్స్ మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్,, పాటలు విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 

Latest Videos

‘మిల్కీ బ్యూటీ’ (Milky Beauty) టైటిల్ తో నెక్ట్స్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. కొద్దిసేపటి కింద ఈపాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో అదిరిపోయింది. క్యాచీ ట్యూన్, చిరు, తమన్నా స్టెప్పులు ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరోవైపు మిల్క్ బ్యూటీ తమన్నా మరింతగా మెరిసిపోతోంది. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలవబోతున్నట్టు అనిపిస్తోంది. 

ఈపాటకు రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు ఆకట్టుకునే లిరిక్స్ రాశారు.  మహతి స్వర సాగర్, విజయ్ ప్రకాష్, సంజన కాల్మంజే పాడారు.  మహతి స్వరసాగర్ మంచి ట్యూన్ అందించారని తెలుస్తోంది. ఈపాటకు సంబంధించిన ఫుల్ వెర్షన్ రేపు సాయంత్రం 4 : 05 నిమిషాలకు విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు. ప్రొమోలో బ్యూటీఫుల్ స్టెప్పులతో అదరగొట్టడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇక ఈ మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చెల్లెలి పాత్రను పోషించింది. బుల్లితెర యాక్ట్రెస్ శ్రీముఖి, రష్మీగౌతమ్ లు కూడా కనిపించబోతున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపుదిద్దుకుందీ చిత్రం. సాగర్ మహతీ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

You guys have been asking for a Melody from Bholaa Shankar and your wish is my command 🙏🏻❤️ third single 🤍
Song Promo is out now 🎶

- https://t.co/PkRCLT54F0

Full Lyrical Tomorrow @ 4:05 PM❤️‍🔥

Mega🌟
A film by pic.twitter.com/MvaQMnmmhS

— Mahati Swara Sagar (@SagarMahati)
click me!