అర్థరాత్రి అల్లు అర్జున్‌ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. అభిమానులతో ఐకాన్‌ స్టార్‌ మీట్‌ అండ్‌ గ్రీట్‌..

Published : Apr 08, 2024, 09:47 AM IST
అర్థరాత్రి అల్లు అర్జున్‌ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. అభిమానులతో ఐకాన్‌ స్టార్‌ మీట్‌ అండ్‌ గ్రీట్‌..

సారాంశం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన అభిమానులను కలిశారు. అర్థరాత్రి భారీగా అభిమానులు ఆయన ఇంటికి తరలి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది.   

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నేడు పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. 43లోకి అడుగుపెడుతున్నారు బన్నీ. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీతోనే పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకోబోతున్నారు. అంతేకాదు తన అభిమానులకు ప్రస్తుతం నటిస్తున్న `పుష్ప 2` సినిమా నుంచి ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఈ చిత్ర టీజర్ ని మరికాసేపట్లో రిలీజ్‌ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బన్నీ వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది.

అర్థరాత్రి అల్లు అర్జున్‌ని కలిసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. తన ఇంటి వరకు భారీగా ఫ్యాన్స్ చేరుకున్నారు. బన్నీకి ముందుగానే బర్త్ డే విషెస్‌ చెప్పేందుకు వాళ్లు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి రావడం విశేషం. సెల్‌ ఫోన్‌ టార్చ్ లైట్ల వెలుగులో పుష్ప, పుష్పరాజ్‌ అంటూ అరుపులతో హోరెత్తించారు. దీంతో వారి శబ్దానికి ఇంట్లో నుంచి అల్లు అర్జున్‌ బయటకు వచ్చారు. తన గేట్‌ వద్ద పైకి ఎక్కి అభిమానులకు అభివాదం తెలిపారు. వారితో మీట్ గ్రీట్‌ లో పాల్గొని ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. 

అయితే ఇందులో బన్నీ లుక్‌ కూడా పుష్పరాజ్‌ స్టయిల్‌లోనే ఉండటం విశేషం. ఇలా బన్నీని చూసి ఫ్యాన్స్ హోరెత్తిపోయారు. అరుపులతో హ్యాపీ బర్త్ డే అన్నా అంటూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతటి అర్థరాత్రి అభిమాన హీరోకి విషెస్‌ తెలియజేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు తరలి రావడం విశేషం. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ షేర్ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. 

ఇక ప్రస్తుతం బన్నీ `పుష్ప 2` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తుంది. శ్రీవల్లీ పాత్రలో ఆమె మెరవబోతుంది. అనసూయ, సునీల్‌,రావు రమేష్‌ నెగటివ్‌ రోల్స్ చేస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి