`ఫ్యామిలీ స్టార్‌`, విజయ్‌ దేవరకొండపై ఎటాక్‌.. దిల్‌రాజు సంచలన వ్యాఖ్యలు.. సైబర్‌ క్రైమ్‌కి ఫిర్యాదు

By Aithagoni RajuFirst Published Apr 7, 2024, 8:42 PM IST
Highlights

విజయ్‌ దేవరకొండ నటించిన `ఫ్యామిలీ స్టార్‌` సినిమాపై నెగటివ్‌ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత దిల్‌ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ టీమ్‌ పోలీస్ కంప్లెయింట్‌ చేసింది. 
 

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన `ప్యామిలీ స్టార్‌` మూవీ ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకొచ్చింది. సినిమాకి క్రిటిక్స్ నుంచి మిక్స్ డ్‌ రివ్యూలు వచ్చాయి. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం దారుణంగా నెగటివ్‌ టాక్‌ని స్ప్రెడ్‌ చేశారు. రిలీజ్‌కి ముందే దారుణమైన కామెంట్స్ చేస్తూ సినిమాని డ్యామేజ్‌ చేసే ప్రయత్నం చేశారు. హీరో విజయ్‌ దేవరకొండపై కూడా ఎటాక్‌ చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన మహేష్‌ బాబు మూవీ `గుంటూరు కారం`పై ఎలాంటి ట్రోలింగ్‌ జరుగుతుందో, ఇప్పుడు విజయ్‌ దేవరకొండ నటించిన `ఫ్యామిలీ స్టార్‌` మూవీపై కూడా అదే రేంజ్‌లో నెగటివ్‌ ట్రోల్‌ జరుగుతుంది. 

ఈ నేపథ్యంలో నిర్మాత దిల్‌రాజు దీనిపై స్పందించారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా సినిమాలపై నెగటివ్‌ ట్రోల్స్ చేస్తే అది ఇండస్ట్రీకే ప్రమాదం అని, నెగటివ్‌ ప్రచారం చిత్ర పరిశ్రమకి మంచిది కాదని తెలిపారు. `ఫ్యామిలీ స్టార్‌` మూవీకి ఆడియెన్స్  నుంచి మంచి స్పందన ఉందని, వారికి సినిమా నచ్చిందని, కానీ సోషల్‌ మీడియాలో మాత్రం నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేదంటే అందరి దాన్ని ఆమోదించాల్సిందే అని తెలిపారు. కానీ నెగటివ్‌ ప్రచారమనేది ఆడియెన్స్ ని సినిమాకి రాకుండా అడ్డుకుంటుందన్నారు. 

`మదర్‌, ఫాదర్‌ నుంచి గ్రాండ్‌ పేరెంట్స్ వరకు చూసిన వారంతా సినిమా బాగుందని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ సినిమా రీచ్‌ అయ్యింది. వారు థియేటర్‌కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒక మంచి సినిమా తీశాం, థియేటర్‌కి వచ్చి చూడండి, నచ్చితే పది మందికి చెప్పండి, నచ్చకపోతే దాన్ని తీసుకోవడానికి మేం సిద్దమే. బయట ఎక్కువగా నెగటివ్‌ ప్రచారం జరుగుతుంది, కానీ సినిమా అలా లేదు, చాలా బాగుందని నాతో అంటున్నారు` అని తెలిపారు. తాను ఆడియెన్స్ రెస్పాన్స్‌ కోసం స్వయంగా థియేటర్‌కి వెళ్లానని, వారి నుంచి రెస్పాన్స్ బాగుందని చెప్పారు దిల్‌ రాజు. 

ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళాలో ఓ కోర్టు.. సినిమా రిలీజ్‌ అయిన మూడు రోజుల వరకు రివ్యూలు ఇవ్వొద్దు అని తీర్పు ఇచ్చింది. అలాంటిదే ఇక్కడ కూడా అమలు చేస్తే బాగుంటుందన్నారు. అలాంటిది ఏదైనా వస్తే తప్ప ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మనుగడ సాధించలేదని తెలిపారు ఆయన. చాలా మంది నెగటివ్‌ వైబ్స్ పెట్టుకుని ఉంటున్నారు, కానీ ఎఫెక్ట్ అయ్యేది ఎవరనేది చూడటం లేదు. నిర్మాతలు దీని వల్ల నష్టపోతారు. ఆడియెన్స్ ని థియేటర్‌కి రాకుండా చేయడం వల్ల నిర్మాతలు నష్టపోతారు, పోను పోను పెద్ద డ్యామేజ్‌ జరిగి ఇక సినిమాలు ఏం తీస్తాం లే అనుకునే వాళ్లు ఎక్కువ అవుతారు. దీని వల్ల చాలా మార్పులు వస్తాయి. ఈ నెగటివిటీ మంచిది కాదు` అని ఆయన తెలిపారు. 

దీనిపై విజయ్‌ దేవరకొండ టీమ్‌ కూడా స్పందించింది. `ఫ్యామిలీ స్టార్‌` సినిమాకి సక్సెస్‌ రావద్దని, విజయ్‌కి పరు రాకూడదని సోషల్‌ మీడియాలో నెగటివ్‌ ప్రచారం చేస్తుందని తెలిపింది. ఇవన్నీ `ఫ్యామిలీ స్టార్` సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చింది. నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా  విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇంటెన్షనల్ గా కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చేస్తున్న దుష్ప్రచారం వల్ల సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `ఫ్యామిలీ స్టార్‌` సినిమాకి పరశురామ్‌ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు నిర్మించారు. 
 

click me!