ఆందోళన కలిగిస్తున్న బాలు ఆరోగ్యంపై లేటెస్ట్ బులెటిన్..!

Published : Aug 19, 2020, 07:20 PM ISTUpdated : Aug 19, 2020, 07:30 PM IST
ఆందోళన కలిగిస్తున్న బాలు ఆరోగ్యంపై లేటెస్ట్ బులెటిన్..!

సారాంశం

కోవిడ్ కారణంగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఎంజిఎం ఆసుపత్రి వర్గాల తాజా బులెటిన్ కొంచెం ఆందోళన కలిగించేదిగా ఉంది.

ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. కోవిడ్ బారిన పడిన ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. రెండు వారాలుగా ఆయన కోవిడ్ కి చికిత్స తీసుకుంటున్నారు. ఐతే ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. బాల సుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ ప్రతి రోజు బాలు ఆరోగ్యంపై సమాచారం అందిస్తున్నారు. 

ఇక నేడు ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులెటిన్ ఆందోళన కలిగిస్తుంది . నేటి బులెటిన్ లో బాలు ఆరోగ్యం విషమంగానే ఉందని తెలియజేశారు. అలాగే  ఆయనకు ఐ సి యూలో లైఫ్ సపోర్టింగ్ సిస్టం ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. ఐ సీ యూ లో ఎస్పీ బాలుని జాయిన్ చేసి దాదాపు వారం అవుతుంది. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడక పోవడం ఆందోళన కలిగిస్తుంది. 

బాల సుబ్రహ్మణ్యం కోలుకొని తిరిగి రావాలని ఆయన సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు. బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చి తన మధుర స్వరంతో పాటలు ఆలపించాలని కాంక్షిస్తున్నారు. చిరంజీవి , కమల్ హాసన్, రజిని కాంత్, ఇళయ రాజా, భారతీ రాజా ఇలా అనేక మంది చిత్ర ప్రముఖులు ఆయన కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?