బన్నీతో పూజాకు ఆ షాట్ పర్ఫెక్ట్ గా కుదిరిందట..!

Published : Aug 19, 2020, 06:45 PM ISTUpdated : Aug 19, 2020, 06:58 PM IST
బన్నీతో పూజాకు ఆ షాట్ పర్ఫెక్ట్ గా కుదిరిందట..!

సారాంశం

బుట్ట బొమ్మ పూజ హెగ్డే అల వైకుంఠపురంలో మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ నమోదు చేసుకుంది. బన్నీ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేసింది.కాగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఓ షాట్ పర్ఫెక్ట్ గా సింగిల్ షాట్ లో ఒకే  అయ్యిందట. ఆ స్పెషల్ షాట్ కి సంబందించిన వీడియో పూజ పంచుకున్నారు.   

ఏడాది ప్రారంభంలో వచ్చిన అల వైకుంఠపురంలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ పర్ఫెక్ట్ సంక్రాంతి చిత్రంగా ప్రేక్షకుల ప్రశంశలు అందుకుంది. బన్నీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ఈ చిత్రంతో అందుకున్నారు. అల వైకుంఠపురంలో మూవీతో బన్నీ నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ విజయంలో అల్లు అర్జున్ నటన మరియు పూజ హెగ్డే గ్లామర్ తో పాటు థమన్ సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. 

అల వైకుంఠపురంలో మూవీ కోసం కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్, తన సాంగ్స్ తో మ్యూజిక్ లవర్స్ ని ఒక ఊపు ఊపారు. బాలీవుడ్ వరకు ఈ సాంగ్స్ మేనియా పాకిందంటే అర్థం చేసుకోవచ్చు, ఈ మూవీ సాంగ్స్ ఎంత ఆదరణ దక్కించుకున్నాయో. ఇక ఈ ఆదివారం అల వైకుంఠపురంలో మూవీ జెమినీ టీవీలో ప్రసారం కావడం జరిగింది. ఈ సందర్భంగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఓ అరుదైన వీడియో క్లిప్ తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. 

అల వైకుంఠపురంలో నుండి ఊర మాస్ బీట్ లో రూపొందిన రాములో రాములో సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ సాంగ్ చిత్రీకరణ సమయంలో బన్నీ, పూజ హెగ్డే మరియు సుశాంత్, నివేదా పేతురాజ్ లపై తీసిన ఓ షాట్ ని ఆమె షేర్ చేశారు. ఆ షాట్ వన్ టేక్ లో దర్శకుడు త్రివిక్రమ్ ఒకే చేశారట. అలాగే ఎక్స్ప్రెషన్స్ మరియు టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరాయని ఆమె తన పోస్ట్ లో వివరించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?