మీటర్ మూవీ ట్రైలర్: మాస్ పోలీస్ గా కిరణ్ అబ్బవరం అదుర్స్!

Published : Mar 29, 2023, 12:02 PM IST
మీటర్ మూవీ ట్రైలర్: మాస్ పోలీస్ గా కిరణ్ అబ్బవరం అదుర్స్!

సారాంశం

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ మీటర్. విడుదలకు సిద్ధం కాగా ట్రైలర్ విడుదల చేశారు. మాస్ పోలీస్ గా కిరణ్ అబ్బవరం ఆకట్టుకున్నాడు.   

జయాపజయాలతో సంబంధం లేకుండా కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తున్నారు. నెలల వ్యవధిలో కిరణ్ నాలుగు సినిమాలు విడుదల చేశారు. గత ఏడాది సెబాస్టియన్ పీసీ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రాలు చేశారు. సమ్మతమే చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో వినరో భాగ్యము విష్ణు కథ అంటూ ప్రేక్షకులను పలకరించారు. 

వినరో భాగ్యము విష్ణు కథ సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు. ఇమేజ్ తెచ్చిపెట్టే ఓ భారీ కమర్షియల్ హిట్ కోసం కిరణ్ అబ్బవరం ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా మీటర్ మూవీ చేశారు.  మీటర్ మూవీలో కిరణ్ పోలీస్ రోల్ చేశారు. యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కుమ్మేశాడు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ దుమ్మురేపింది. లవ్, రొమాన్స్, యాక్షన్ అంశాలు కలగలిపి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించారనిపిస్తుంది. 

స్టార్ హీరో రేంజ్ లో కిరణ్ పంచ్ డైలాగ్స్ కొట్టారు. హీరోయిన్ తో కెమిస్ట్రీ అదిరింది. కిరణ్ కి జంటగా అతుల్య రవి నటిస్తున్నారు.  మీటర్ మూవీ ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. రమేష్ కాడూరి చిత్ర దర్శకుడిగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మించారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందించారు. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగాయి. కాగా రూల్స్ రంజన్ టైటిల్ తో కిరణ్ మరో చిత్రంలో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?