సంక్రాంతి బరిలో క్లీన్ మూవీగా ‘కళ్యాణం కమనీయం’.. తాజాగా సెన్సార్ పూర్తి.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్!

Published : Jan 08, 2023, 12:45 PM IST
సంక్రాంతి బరిలో క్లీన్ మూవీగా ‘కళ్యాణం కమనీయం’.. తాజాగా సెన్సార్ పూర్తి.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్!

సారాంశం

సంక్రాంతి బరిలో క్లీన్ మూవీగా హీరో సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అలాగే ఓ మెలోడీ సాంగ్ కూడా విడుదలైంది.  

వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Sobhan). గతేడాది ‘లైక్ షేర్ అండ్ సబ్ స్రైబ్’తో ఆకట్టుకున్నారు. తాజాగా నటిస్తున్న కొత్త సినిమా ‘కళ్యాణం కమనీయం’ Kalyan Kalaneeyam. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. ఇక తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం అభినందనలను తెలియజేశారు. సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. 

తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి మరో మెలోడీ ‘అయ్యో ఏంటో నాకు’ (Ayyo Ento) అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా స్వీకర్ అగస్తి పాడారు. 'అయ్యో ఎంటో నాకు అన్ని వచ్చి పక్కనున్న ఒక్క అదృష్టమేమో దూరముందే..అన్నీ ఇచ్చేసినట్టు ఇచ్చి లాగేసుకుంటు దైవం వైకుంఠపాళీ ఆడతాడే' అంటూ భార్యభర్తలైన హీరో హీరోయిన్ల మధ్య చిన్న చిన్న మనస్పర్థల నేపథ్యంలో సాగుతుందీ పాట. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

ఈ సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే కాన్సెప్ట్ తో రూపొందడం విశేషం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీగా కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ గా సత్య జి, సంగీతం దర్శకుడిగా శ్రావణ్ భరద్వాజ్ బాణీలు కట్టారు.  ఇక సంతోష్ శోభన్ నటించిన మరో రెండు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాదే ‘ప్రేమ్ కుమార్’ మరియు ‘అన్నీ మంచి శకునాలే’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు