Amigos Teaser: అమిగోస్ టీజర్... అంచనాలు పెంచేసిన కళ్యాణ్ రామ్!

Published : Jan 08, 2023, 12:25 PM ISTUpdated : Jan 08, 2023, 12:34 PM IST
Amigos Teaser: అమిగోస్ టీజర్... అంచనాలు పెంచేసిన కళ్యాణ్ రామ్!

సారాంశం

ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న కళ్యాణ్ రామ్ మరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన అమిగోస్ చిత్ర టీజర్ నేడు విడుదల చేశారు.


కళ్యాణ్ రామ్ విజయం దాహం తీర్చింది బింబిసార చిత్రం. ఊహకు మించిన విజయాన్ని నమోదు చేసింది. ఏళ్ల తర్వాత కళ్యాణ్ ఒక క్లీన్ హిట్ అందుకున్నాడు. నిర్మాతలకు బయ్యర్లకు బింబిసార మంచి లాభాలు పంచింది. బింబిసారుడి చరిత్రను ఆధునిక కాలానికి ముడిపెట్టి  దర్శకుడు వశిష్ట్ సోసియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కించారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో బింబిసార స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. 

బింబిసార విజయం ఇచ్చిన జోరులో కళ్యాణ్ రామ్ వరుస చిత్రాలు ప్రకటించారు. ఆయన లేటెస్ట్ మూవీ అమిగోస్. కళ్యాణ్ రామ్ కెరీర్లో మొదటిసారి ట్రిపుల్ రోల్ చేశారు. అమిగోస్ గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. దర్శకుడు రాజేంద్రరెడ్డి అమిగోస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్ తో పాటు కాన్సెప్ట్ కూడా భిన్నంగా ఉంది. నిమిషానికి  పైగా ఉన్న టీజర్ ఆకట్టుకుంది. 

అమిగోస్ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి కీలక రోల్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అమిగోస్ సిల్వర్ స్క్రీన్ పై వర్క్ అవుట్ అయితే భారీ విజయం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. అమిగోస్ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా అమిగోస్ విడుదల కానుందని సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే