మంచి స్నేహితుడు దొరికాడు

Published : Sep 28, 2017, 03:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
మంచి స్నేహితుడు దొరికాడు

సారాంశం

కృష్ణగాడి వీర ప్రేమగాథతో తెలుగు తెరకు పరిచయమైన మెహరీన్ మహానుభావుడితో ప్రేక్షకుల మందుకు రానున్న మెహరీన్ శర్వానంద్ మంచి స్నేహితుడన్న మెహరీన్

కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మెహరీన్ కౌర్. ఆ సినిమాలో.. అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తూ..‘ నే చెప్పానా.. నే చెప్పానా.. నే చెప్పానా’ అంటూ.. ఆమె చెప్పిన డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఆమె మారుతి దర్శకత్వంలో శర్వానంద్ సరసన ‘ మహానుభావుడు’ సినిమాలో నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర విశేషాలు మెహరీన్ మాటల్లోనే..

 

’’పల్లెటూరిలో పుట్టి ఉద్యోగం కోసం పట్టణానికి వచ్చిన అమ్మాయిలా కనిపిస్తా. మేఘన నా పాత్ర పేరు. ఓసీడీ ( అతి శుభ్రత) అనే జబ్బు ఉన్న అబ్బాయిని ప్రేమిస్తా. ప్రియుడికోసం సంఘర్షణ పడే అమ్మాయి పాత్ర పోషించాను. తొలి చిత్రంతో పోలిస్తే ఈ సినిమాలో నా పాత్ర కొంచెం భిన్నంగా ఉంటుంది.

 

ఈ సినిమా తమిళ సినిమా నుంచి కాపీ కొట్టారనే పుకార్లు వచ్చాయి. ఓసీడీ నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చి ఉండవచ్చు. కానీ ఏ సినిమాకీ కాపీ కాదు. చాలా భిన్నమైన కథాంశం ఇది. ఆద్యంతం వినోదంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు అన్ని రకాల భావోద్వేగాలుంటాయి. మారుతి తెరకెక్కించిన గత చిత్రం భలేభలేమగాడివోయ్‌కు ఈ సినిమాకు ఎలాంటి పోలికలు ఉండవు. 

 

తెలుగు మాట్లాడలేను కానీ బాగా అర్థమవుతుంది. ఈ సినిమాలో ఎక్కువ నిడివితో కూడిన సంభాషనల్ని చెప్పాను. కృష్ణగాడి వీర ప్రేమగాథ తర్వాత ఏడాదిన్నర విరామం వచ్చింది. నా సినిమాలు విడుదల కాలేకపోయినా నేను మాత్రం ఇతర సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. ఇప్పుడే నా టైమ్ మొదలైంది. నేనేంటో నిరూపించుకునే అవకాశం దొరికిందని అనుకుంటున్నాను. మహానుభావుడితో శర్వానంద్ రూపంలో మంచి స్నేహితుడు దొరికాడు. రవితేజ ఎనర్జీని అందుకోవడం చాలా కష్టం. షూటింగ్‌లో ప్రతిక్షణం తోటి నటుల్లో స్ఫూర్తిని నింపుతారు. చాలా కష్టపడతారు. ప్రస్తుతం జవాన్, కేరాఫ్ సూర్య, రాజా ది గ్రేట్ సినిమాల్లో నటిస్తున్నాను.’’

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌