వరల్డ్ కప్ ఆడనున్న రణ్ వీర్ సింగ్

Published : Sep 28, 2017, 03:16 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
వరల్డ్ కప్ ఆడనున్న రణ్ వీర్ సింగ్

సారాంశం

1983 వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నెట్టింట సందడి చేస్తున్న రియల్ అండ్ రీల్ కపిల్ దేవ్ ఫోటోలు

బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ వరల్డ్ కప్ ఆడనున్నారు. అందేంటీ ఆయన క్రికెటర్ కాదు కదా.. వరల్డ్ కప్ ఎలా ఆడతాడు అనే కదా డౌట్. ఆయన ఆడేది నిజజీవితంలో కాదండి. సినిమాలో ఆడతారు. టీమ్ ఇండియా లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్  కెప్టెన్సీలో తొలిసారి 1983లో భారత్ వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో  ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కపిల్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటించనున్నారు.

 

ఈ నేపథ్యంలో ఆనాడు వరల్డ్ కప్ గెలిచిన టీం అంతా ఓ ఈవెంట్ కి హాజరైంది. ఈ టీంతో హీరో రణ్ వీర్, దర్శకుడు కబీర్ ఖాన్ లు కలిసి సందడి చేశారు. రియల్ కపిల్ దేవ్ తో రీల్ కపిల్ దేవ్ దిగిన ఫోటోలు  ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ స్పెషల్ ఈవెంట్‌కు కెప్టెన్ కపిల్‌తోపాటు టీమ్ సభ్యులు వెంగ్‌సర్కార్, మదన్‌లాల్, సందీప్ పాటిల్, మొహిందర్ అమర్‌నాథ్, రోజర్ బిన్నీ కూడా హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌