
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగు తెరపై మెరిసిన పంజాబీ భామ మెహ్రీన్. తొలి సినిమాతోనే యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. మరిన్ని ఛాన్సులు పట్టేయడం ఖాయమని అప్పుడే అంతా అనుకున్నారు. కొంత గ్యాప్ వచ్చినా..ఇప్పుడు మెహ్రీన్ వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
మెహరీన్ నటించి, విడుదలైంది ఒక్క కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమానే అయినా.. ప్రొడక్షన్ లో నాలుగైదు సినిమాల వరకు వున్నాయి. ఓ బాలీవుడ్ సినిమా, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, అల్లు శిరీష్ ఇలా ఇప్పుడు శర్వానంద్ పక్కన మారుతి డైరక్షన్ లో యువి సంస్థ నిర్మించే మరో సినిమాకు సైన్ చేసిందట.
బాలీవుడ్ లోనూ రెండు సినిమాలు చేజిక్కించుకొంది. ఇందులో ఒక్కటి బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ నిర్మించనున్నచిత్రం కూడా ఉండటం విశేషం. ఈ చిత్రాలన్ని షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకొస్తే.. ఈ అమ్మడి కెరీర్కి ఇక తిరుగులేనట్టే. ఐదారు సినిమాలతో బిజీగా ఉన్న మెహ్రీన్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయమనే మాట ఇప్పటికే వినిపిస్తోంది.
మోడల్ గా తన కెరీర్ మొదలు పెట్టిన మెహ్రీన్ ఒక పక్క వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే సినీ రంగంలో కాలుపెట్టింది డవ్ ,పియర్స్ , నికాన్ ,హీరో విశాల్ తో థమ్స్ అప్ యాడ్ ఇవన్నీ ఆమెకు పేరు తెచ్చాయి. ఇక ఇప్పటికైతే అవకాశాలకు తిరుగులేదు. హిందీ లో అనుష్క శర్మ నిర్మించిన ఫిల్లరీ కూడా విడుదలకు సిద్ధంగా వుంది. మెహ్రీన్ పుట్టింది పంజాబ్ లో పెరిగింది ఢిల్లీ లో. చదువు కెనడా లో. కెనడా లో జరిగిన మిస్ సౌతేసియా కెనడా పోటీల్లో మిస్ పర్సనాలిటీ గా నెగ్గింది. అందం, అభినయం కలగలిపిన ఈ పంజాబీ భామ తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఆశిద్దాం.