Acharya Pre Release Event: ఆచార్య ఇంటర్వెల్ బ్యాంగ్ చూశా.. మునుపెన్నడూ చూడని మెగాస్టార్ ని చూస్తారు

Published : Apr 23, 2022, 09:03 PM IST
Acharya Pre Release Event: ఆచార్య ఇంటర్వెల్ బ్యాంగ్ చూశా.. మునుపెన్నడూ చూడని మెగాస్టార్ ని చూస్తారు

సారాంశం

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు.నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 

ప్రీరిలీజ్ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి నటిస్తున్న తదుపరి చిత్రం భోళా శంకర్ దర్శకుడు మెహర్ రమేష్ మెరిశారు. ఆచార్య చిత్రంలోని నీలాంబరి వీడియో సాంగ్ లాంచ్ చేశారు. 

ఇక మెహర్ రమేష్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంటేనే ఒక పండగలా ఉంటుంది. అలాంటిది కొరటాల శివ గారు చిరంజీవి, రాంచరణ్ ఇద్దరినీ చూపిస్తున్నారు. ఇది ఫ్యాన్స్ కి కనుల పండుగే అని అన్నారు. 

ఆచార్య చిత్రంలో నేను ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ చూశాను. అందులో మునుపెన్నడూ చూడని మెగాస్టార్ ని చూస్తారు అని మెహర్ రమేష్ అన్నారు. అలాగే బంజారా సాంగ్ లో చిరు, చరణ్ డాన్స్ ఐఫీస్ట్ లా ఉంటుందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..