
సీనియర్ నటుడు, హీరో రాజశేఖర్ (Rajashekar) వరుస సినిమాలతో, విభిన్న కథలతో తన అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఏజ్ పెరిగినా తన గ్రేస్ ఏమాత్రం తగ్గకుండా ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తున్నాడు. గతంలో ‘గరుడ వేగ, కల్కి, దెయ్యం’ చిత్రాలతో అలరించిన రాజశేఖర్.. ప్రస్తుతం ‘శేఖర్’ (Shekar Movie)తో థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నారు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘శేఖర్’ చిత్రానికి దర్శకుడు లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. మలయాళ హీరోయిన్ ఆత్మీన్ రాజన్ (Athmeeya Rajan) హీరోయిన్ గా నటిస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులకు మందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్ ఆడియెన్స్ ను ఆకట్టకుంటున్నాయి. తాజాగా మారో క్రేజీ అప్డేట్ ను అందించారు మేకర్స్. చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. గతంలో మే 21న రిలీజ్ అవుతుందని ప్రకటించగా.. తాజాగా ఒక్కరోజు ముందుగానే రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. మే 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా ‘శేఖర్’ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
మరోవైపు, 2017లో రాజశేఖర్ నటించి, రిలీజ్ అయిన చిత్రం ‘పీఎస్ వీ గరుడ వేగ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే పొందింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చెల్లింపుల్లో జ్యోస్టార్ ఎండీ చెక్కు బౌన్స్ కేసును నమోదు చేశారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న జీవితా రాజశేఖర్ స్పందిస్తూ తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ‘శేఖర్’ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, మల్లికార్జున నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. ఎంఎల్‌వి సత్యనారాయణ పెగాసస్ సినీ క్రాప్, టారస్ సినీ క్రాప్ బ్యానర్లపై నిర్మించారు.