
భర్త చిరంజీవి సర్జా మధుర స్మృతుల నుంచి బయటకు రాలేకపోతోంది హీరోయిన్ మేఘన. తన తనయుడిని భర్త మిగిల్చిన గుర్తు గా అపురూపంగా చూసుకుంటుంది. వారిద్దరు కలిసి తన మనస్సులు నిలిచిపోయేలా వారి పేర్లను పచ్చబొట్టు వేయించుకుంది.
భర్త చిరంజీవి సర్జా, కొడుకు రాయన్ పేర్లను తన చేతి మణికట్టు పై పచ్చబొట్టుగా వేయించుకుంది, కన్నడ హీరోయిన్ మేఘన. వారు ఎప్పటికీ తనగుండెలో ఉండిపోతారని..అంటోంది. ఈ టాటుకు సంబంధించి ఫోటోలను మేఘన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది మేఘన.
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ స్టార్ గా వెలుగు వెలిగిన చిరంజీవి సర్జా 2020 జూన్ 7న హార్ట్ ఎటాక్ తో సడెన్ గా మరణించారు. సౌత్ స్టార్ హీరో అర్జున్ కు చిరంజీవి సర్జా మేనల్లుడు. చిరంజీవి సర్జా తమ్ముడు దృవ్ సర్జా కూడా కన్నడ నాట యంగ్ హీరోగా కోనసాగుతున్నారు.చిరంజీవి సర్జా మరణం తరువాత చాలా కాలం బయటకు రాలేదు మేఘనా సర్జా. అప్పటికే ఆమె మూడు నెలల గర్బవతి కావడంతో.. కొంత కాలానికి పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఆ బాబును చిరంజీవి సర్జా ప్రతిరూపంగా పెంచుకుంటున్నారు.
కన్నడ సూపర్‌స్టార్ చిరంజీవి మరణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్. తిరిగి తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన ఆమె ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో ఉంది. అక్కడే ఆమె చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. అయితే చిరంజీవి సర్జా మరణం తరువాత ఆమెపై రకరకాలు పుకార్లు వచ్చాయి. మేఘన రెండో పెళ్లి చేసుకోనుందంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. కాని వాటిని ఆమె ఖండించారు. అవన్నీ పుకార్లేనని అటువంటి ఆలోచనే తనకు లేదంది మేఘన.