Student Movie Teaser: శ్రీహరి కొడుకు అదరగొట్టేశాడుగా.. 'స్టూడెంట్' మూవీ టీజర్ వచ్చేసింది

Published : Jun 28, 2026, 09:05 PM IST
Student Movie

సారాంశం

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కుతున్న స్టూడెంట్ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ లో మేఘాంశ్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. విద్యార్థి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఉన్నారు. 

శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా 'స్టూడెంట్'

దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "స్టూడెంట్". ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం సంగీత, బెల్లం బయ్యారెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. "స్టూడెంట్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ రిలీజ్

"స్టూడెంట్" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - సరదాగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ భాను (మేఘాంశ్ శ్రీహరి) ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరుపున పాలిటిక్స్ లోకి రావడం కాలేజ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పాలిటిక్స్ కు కొత్తైనా రాజకీయాల్లో ఉండే ప్రమాదాలను, ఎత్తులు పై ఎత్తులను త్వరగా అర్థం చేసుకుంటాడు భాను. 'పక్కనోడు కత్తితో యుద్ధం చేస్తున్నప్పుడు మనం చెయ్యి పెడితే తెగిపోద్ది, మనం పాలిటిక్స్ లో ఉన్నాం, ఇక్కడ ఎథిక్స్ ఉండవు, ఓన్లీ ట్రిక్సే ఉంటాయి' అంటూ మేఘాంశ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ టీజర్ కు హైలైట్ గా నిలుస్తోంది.

స్టూడెంట్ రాజకీయాల్లోకి వస్తే ఈ పొలిటికల్ ఆటను ఎలా మార్చేయగలడు అనేది ఇంపాక్ట్ ఫుల్ గా చూపించారు. భాను లైఫ్ లో తన్మయితో ఉన్న ప్రేమకథ ఏంటి?, రాజకీయాల్లోకి వచ్చి భాను తను అనుకున్నది సాధించగలిగాడా లేదా?, భుజంగం, కేతిరెడ్డి మధ్య గొడవలేంటి? అనే అంశాలతో టీజర్ ఆసక్తిని కలిగించింది. లీడర్ లక్షణాలు ఉన్న డేరింగ్ స్టూడెంట్ గా, యంగ్ పొలిటీషియన్ గా మేఘాంశ్ ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ కనబర్చారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్ట్రాంగ్ విజువల్స్, క్రియేటివ్ షార్ట్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు, బీజీఎం హై క్వాలిటీతో ఉన్నాయి.

నటీనటులు - మేఘాంశ్ శ్రీహరి, విజేత పరీక్, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavya Maran Wedding: అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
OG Universe : ఓజీ 2 కథలో సుభాష్ చంద్రబోస్ ట్విస్ట్.. కరెక్ట్ గా కుదిరితే రికార్డులు బద్దలే ?