ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాకిస్తున్న మెగాస్టార్

Published : Sep 07, 2019, 04:41 PM IST
ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాకిస్తున్న మెగాస్టార్

సారాంశం

  మెగాస్టార్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా ప్రీ రిలీజ్ కి సంబందించిన లెక్కలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

మెగాస్టార్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా ప్రీ రిలీజ్ కి సంబందించిన లెక్కలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సినిమా ఏ స్థాయిలో లాభాల్ని అందిస్తుందో గాని అంచనాల ప్రకారం  ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనున్నట్లు గట్టిగానే  టాక్ వస్తోంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల వరకు సైరా బిజినెస్ జ‌రిగినట్లు సమాచారం.  నైజాంలో అత్యధికంగా సైరా రూ.30కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ లో మెగాస్టార్ స్టామినాతో రూ.22 కోట్లకు, ఉత్త‌రాంధ్రలో రూ.14.4 కోట్లకు సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడ‌య్యాయ‌ని తెలుస్తోంది. ఇక తూర్పు గోదావరి - కృష్ణ ఏరియాల్లో మొత్తంగా 17కోట్లకు అమ్ముడైన సైరా గుంటూరులో  రూ.11.5కోట్లు, నెల్లూరులో రూ.4.8కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. 

సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు ఎంత వసూలు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 2న విడుదల కానున్న సైరాకు దసరా హాలిడేస్ కలిసొచ్చే అవకాశం ఉంది. మరి ఆ కొన్ని రోజుల్లో సినిమా ఎలాంటి లాభాల్ని అందిస్తుందో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మించాడు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది