బిగ్ బాస్ : కింగ్ ఈజ్ బ్యాక్.. అందరికి ఒక రౌండ్ కోటింగ్!

Published : Sep 07, 2019, 04:40 PM IST
బిగ్ బాస్ : కింగ్ ఈజ్ బ్యాక్.. అందరికి ఒక రౌండ్ కోటింగ్!

సారాంశం

కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా మళ్ళీ వచ్చేశాడు. గత వారం పుట్టినరోజు సందర్భంగా నాగార్జున ఫ్యామిలీతో కలసి వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనితో గత శని, ఆదివారాలు రోజు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హాట్ గా వ్యవహరించారు. నాగ్ వెకేషన్ నుంచి తిరిగి వచేసాడు. బిగ్ బాస్ హోస్ట్ గా వేదికపైకి ఎంటర్ అయిపోయాడు. 

గతవారం బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ జరగలేదు. దీనితో ఈ వీకెండ్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఇదిలా ఉండగా నాగార్జున రాగానే హౌస్ మేట్స్ ని క్లాస్ పీకడం ప్రారంభించేశాడు. ఈ వారం జరిగిన టాస్క్ లలో ఒక్కొక్కరు చేసిన తప్పులని ఎత్తిచూపుతూ షోలో వార్నింగ్ ఇస్తున్నాడు. 

నేడు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో నాగార్జున పునర్నవిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నాడు. ఇంటి సభ్యులందరికి కొరకరాని కొయ్యగా మారిన పునర్నవి నాగార్జున వద్ద కూడా గట్టిగానే వాదిస్తోంది. 

ఇక దొంగల టాస్క్ లో తాను ప్రవర్తించిన విధానాన్ని అలీ రెజా నాగార్జున వద్ద సమర్థించుకుంటున్నారు. ఈ వారం నామినేషన్ లో మహేష్, రవి, అలీ రెజా, శ్రీముఖి, రాహుల్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?