సైరా క్లైమాక్స్ : రోమాలు నిక్కబొడవాల్సిందే!

By Prashanth MFirst Published Sep 25, 2019, 10:51 AM IST
Highlights

దక్షిణాదిన అన్ని భాషలతోపాటు హిందీలో కూడా విడుదలవుతున్న ఈ చిత్రం ట్రైలర్ మొన్ననే విడుదలైంది. ట్రైలర్ వల్ల ఒక్కసారిగా హిందీ చిత్ర పరిశ్రమ షేక్ అయ్యింది. కేవలం ట్రైలర్ దెబ్బకే అదే రోజు వార్ సినిమా విడుదలవుతున్నాకూడా 1200 స్క్రీన్లు ప్రమోషన్లు ఆరంభమవ్వకముందే  ఓకే అయ్యాయి. 

250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరా నరసింహ రెడ్డి చిత్రం అక్టోబర్ 2వ తేదీన మనముందుకు రాబోతుంది. రిలీజ్ కు వారం ముందే సెన్సార్ పనులను పూర్తిచేసుకుంది కూడా. దక్షిణాదిన అన్ని భాషలతోపాటు హిందీలో కూడా విడుదలవుతున్న ఈ చిత్రం ట్రైలర్ మొన్ననే విడుదలైంది. ట్రైలర్ వల్ల ఒక్కసారిగా హిందీ చిత్ర పరిశ్రమ షేక్ అయ్యింది. కేవలం ట్రైలర్ దెబ్బకే అదే రోజు వార్ సినిమా విడుదలవుతున్నాకూడా 1200 స్క్రీన్లు ప్రమోషన్లు ఆరంభమవ్వకముందే  ఓకే అయ్యాయి. 

యాష్ రాజ్ ఫిలిమ్స్ వార్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని దక్కించుకుంది. వారిచేతిలో అధిక థియేటర్లు ఉండడం సహజం అయినప్పటికీ ఇంత భారీ స్థాయిలో స్క్రీన్లు ఓకే అవ్వడం మెగాస్టార్ ట్రైలర్ స్టామినాను తెలియజేస్తుంది. 

ఇక కథ విషయానికివస్తే, ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ని జుర్రేరు వాగువద్ద ఉరితీశారు. ఇలాంటి దేశభక్తి కథల్లో మార్పులు చేయడం కుదరదు. కాబట్టి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో నటిస్తున్న చిరంజీవి పాత్రను చంపేయాలిసిందే. 

ఆ విషయమై ఫాన్స్ తెగ బాధపడిపోతున్నాడు. కొందరైతే ఏకంగా ట్విట్టర్ వేదికగా ఈ చిరంజీవి చనిపోయే సీన్స్ ట్రైలర్ లో ఉంచొద్దు, ట్రైలర్ నుంచే మమ్మల్ని బాధపెట్టొద్దు అని కోరారు కూడా.

తెలుగు సినిమాల్లో హీరో చనిపోవడాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేము. అందునా చిరంజీవి అంత భారీ స్థాయి నటుడు చనిపోతాడు అని చూపించడంఅంటే కత్తి మీద సామే. కాబట్టి చిత్ర బృందం ఈ విషయమై చాల కేర్ తీసుకుందట. 

క్లైమాక్స్ విషయం లో బీజీఎమ్ పీక్స్ అంటున్నారు. ఎమోషన్, సెంటిమెంట్ల కలయికతో చిరంజీవి మరణించినప్పుడు తీసిన షాట్స్ మనకు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయట. ఆ పాత్ర మరణించినప్పుడు చిరంజీవి మరణించాడు అనే బాధ ఫాన్స్ కు కలగకుండా, మాతృ భూమి దాస్య శృంఖలాలను తెంచడానికి ఒక యోధుడు వీరమరణం పొందాడు అని మనలో దేశ భక్తి ఉప్పొంగుతుందట. 

సో, క్లైమాక్స్ సీన్లో రోమాలు నిక్కబొడవాల్సిందేనట. 

click me!