
ఈరోజు(25 ఫిబ్రవరి) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది భీమ్లా నాయక్ (Bheemla Nayak) మూవీ. ఈ సందర్భంగా టీమ్ కు స్పెషల్ విషెష్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi).
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రానా కాంబినేషన్ లో.. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన సినిమా భీమ్లా నాయక్(Bheemla Nayak). ఈమూవీ రిలీజ్ అవ్వడంతోనే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. పవర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. థియేటర్లన్నీ పవన్ కల్యాణ్ నామస్మరణతో మారు మోగి పోతున్నాయి. ఏపీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. పవర్ స్టార్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ఫ్యాన్స్.
ఇక భమ్లా నాయక్ సక్సెస్ తో సెలబ్రెటీస్ టీమ్ సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి భీమ్లా నాయక్ టీమ్ ను విష్ చేశారు. పవన్ కల్యాణ్, రానాతో కలిసి ఉన్న ఫోటోను శేర్ చేసిన మెగాస్టార్.. హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన పవర్ చూపించిన తమ్ముడికి ఎంతో సంతోషంతో శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లానాయక్ మూవీలో హీరోయిన్లుగా నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ నటించారు. సముద్రఖని,మురళీ శర్మ లాంటి సీనియర్లు నటించిన భీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఈరోజు (ఫిబ్రవరి 25) ప్రపంచ వ్యాప్తంగా.. దాదాపు 3 వేల థియేటర్లు.. 10 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది మూవీ.