Chiru and Nani: మీసం మెలేసిన నాని, చిరంజీవి.. ఎందుకంటే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 21, 2022, 07:10 AM IST
Chiru and Nani: మీసం మెలేసిన నాని, చిరంజీవి.. ఎందుకంటే

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని కలసి మీసం మెలేశారు. వినడానికి క్రేజీగా ఉన్న ఈ విషయం చూడడానికి కూడా అద్భుతంగా ఉంది. అందుకే ఈ క్రేజీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని కలసి మీసం మెలేశారు. వినడానికి క్రేజీగా ఉన్న ఈ విషయం చూడడానికి కూడా అద్భుతంగా ఉంది. అందుకే ఈ క్రేజీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి, నాని ఇద్దరూ కలసి మీసం మెలేయడానికి కారణం ఉంది. 

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ చిత్ర వసూళ్లపై కోవిడ్ ప్రభావం పడిందనే చెప్పాలి. శ్యామ్ పాత్రలో నాని నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. దర్శకుడు రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. నటన పరంగా నాని నుంచి వచ్చిన మరో అద్భుతమైన చిత్రం ఇది. 

ఇటీవల కాలంలో చిరంజీవి ప్రతి చిత్రానికి ఏదో ఒక రూపంలో తనవంతు సాకారం, ప్రోత్సాహం అందిస్తున్నారు. తాజాగా చిరంజీవి నానితో కలసి శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని నాని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. 'ఆయనకు శ్యామ్ బాగా నచ్చాడు.. ఈ రోజు అద్భుతంగా ముగిసింది' అంటూ చిరంజీవితో కలసి మీసం మెలేస్తూ తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశాడు. 

ఈ పిక్ నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటోంది. గ్యాంగ్ లీడర్ తో కొత్త గ్యాంగ్ లీడర్ అని, ఆచార్యతో శ్యామ్ సింగ రాయ్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరొకొందరు అభిమానులు వాళ్ళిద్దరూ సెల్ఫ్ మేడ్ స్టార్స్ అంటూ ప్రశంసిస్తున్నారు. 

ఇదిలా ఉండగా చిరు ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఆ చిత్రం కోవిడ్ కారణంగా మరోసారి వాయిదా పడింది. దీనితో మెగా అభిమానులకు నిరీక్షణ తప్పడం లేదు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌