Meera Jasmine: మీరా జాస్మిన్ రీఎంట్రి, వెల్కమ్ చెప్పిన రవితేజ

Surya Prakash   | Asianet News
Published : Jan 21, 2022, 06:50 AM ISTUpdated : Jan 21, 2022, 06:51 AM IST
Meera Jasmine: మీరా జాస్మిన్ రీఎంట్రి,  వెల్కమ్ చెప్పిన రవితేజ

సారాంశం

వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది. ఇప్పుడు మీరా జాస్మీన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.


తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకప్పుడు రాణించిన హీరోయిన్స్ లలో మీరా జాస్మిన్ ఒకరు. తెలుగులో ఆమె బాలకృష్ణ .. జగపతిబాబు .. రవితేజ .. పవన్ కల్యాణ్ లతో సినిమాలు చేసింది. ముఖ్యంగా  'గుడుంబా శంకర్' సినిమా  మీరా జాస్మిన్ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆమెకు గ్లామర్ పరంగా నే కాకుండా నటనాపరంగా ఆమెకి మంచి మార్కులే పడ్డాయి గానీ, సరైన సినిమాలు పడలేదు. దాంతో ఆశించిన స్థాయిలో సక్సెస్  లభించలేదు. అయినా అరాకొరా తమిళ .. మలయాళ భాషల్లో ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అక్కడ ఆమె ఖాతాలో కొన్ని హిట్స్ ఉన్నాయి.

తెలుగుతో పాటు మలయాళం, త‌మిళ భాషల్లో న‌టించిన జాతీయ ఉత్త‌మ న‌టిగా గుర్తింపు పొందింది. 2014లో దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది.అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది. ఇప్పుడు మీరా జాస్మీన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

 

 మీరా జాస్మిన్ రీసెంట్ గా ఇన్ స్టా లో అడుగుపెట్టింది. ఇలా ఇన్ స్టాలో ఎకౌంట్ ఓపెన్ చేసిందో లేదో, అలా ఫాలోవర్స్ సంఖ్య  కుప్పలు తెప్పలుగా  పెరిగిపోతోంది.  చాలా మంది సెలబ్రిటీలు ఆమెకి వెల్కమ్ మెసేజ్ లు పెడుతున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా మీరా జాస్మిన్ కి వెల్కమ్ చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టాడు.  సినిమాలకు .. నా  ఫ్యాన్స్ కు మరింత దగ్గర కావడం కోసమే ఇన్ స్టాలో అడుగుపెట్టినట్టుగా ఆమె చెప్పింది. మలయాళంలో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగులోను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు  కనిపిస్తున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Actors Before Life: సినిమాల్లోకి రాకముందు తాప్సీ, కియారా, మాధవన్ ఏం చేసేవారో తెలుసా?