అంబులెన్సు సర్వీసులు ప్రారంభించనున్న చిరంజీవి!

By team teluguFirst Published Jun 10, 2021, 3:23 PM IST
Highlights

ఇటీవల దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ అందుబాటులో లేక వందల మంది కరోనా రోగులు ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో చిరంజీవి వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. 

సామాజిక సేవా స్పృహ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఏళ్లుగా ఆయన చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులకు సహాయం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అనేక మంది నటులు, పేద కార్మికులను చిరంజీవి ఆదుకున్నారు. ఇక కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి వందల మందిని ఆకలి బాధల నుండి కాపాడారు చిరంజీవి. 


ఇటీవల దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ అందుబాటులో లేక వందల మంది కరోనా రోగులు ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో చిరంజీవి వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట అనేక ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 


కాగా చిరంజీవి ప్రజల శ్రేయస్సు కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి ఉచిత అంబులెన్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట. ఆపద సమయంలో ఉన్న రోగులు, ప్రమాద బాధితుల కొరకు అంబులెన్క్ వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ నిర్ణయం ద్వారా చిరంజీవి మరో కీలక అడుగు వేసినట్లు అయ్యింది. 
 

click me!