ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసుకున్న వాల్తేరు వీరయ్య.. ఇక మెగా ఫ్యాన్స్ కు పూనకాలే..

Published : Jan 06, 2023, 11:55 AM ISTUpdated : Jan 06, 2023, 12:08 PM IST
ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసుకున్న వాల్తేరు వీరయ్య.. ఇక మెగా ఫ్యాన్స్ కు పూనకాలే..

సారాంశం

వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ పై క్లారిటీ రావడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సబంధించిన డేట్ టైమ్ కూడా ఫిక్స్ చేశారు టీమ్.   

ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ల మధ్య పోటీ గట్టిగా జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు.. నటసింహం బాలయ్య ఈ సారి పోటీ పడబోతున్నారు. ఈ రెండు సినిమాలకు సబంధించిన ట్రైలర్ డేట్స్ కూడా ఇచ్చేశారు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ పై క్లారిటీ రావడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సబంధించిన డేట్ టైమ్ కూడా ఫిక్స్ చేశారు టీమ్. 

మరోసారి మెగాస్టార్ చిరంజీవిని యంగ్ లుక్ లో మాస్ లుక్ లో చూపిస్తూ.. తెరకెక్కిన  సినిమా  వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది సినిమా.  ఫైనల్ అవుట్ ఫుట్ కూడా టీమ్ చూడటం.. సినిమాపై పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నారు . వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ చేసుకుంటూ వెళ్తున్న టీమ్.. మూవీ ట్రైలర్ డేట్ తో పాటు... తాజాగా  ప్రీ రిలీజ్ ఈవెంట్  డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు.

 

ఇక వరుస ప్రమోషన్స్ తో హోరిత్తించబోతున్నారు. ఈక్రమంలో తాజాగా థియేటరికల్ ట్రైలర్ ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు . అయితే ట్రైలర్ రిలీజ్ టైమ్ మాత్రం ప్రకటించలేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జనవరి 8న నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ముందుగా ఈ ఈవెంట్ ను  వైజాగ్ ఆర్‌కె బీచ్‌లో జరపాలని  అనుకున్నారు . అన్నీరెడీ చేసుకున్నారు కూడా.. . కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో ప్రకారం విధించిన ఆంక్షలతో అక్కడ జరపడానికి పర్మీషన్ దొరకలేదు. 

దాంతో ఈ ఈవెంట్  వేదికను మారుస్తూ.. మూవీ టీమ్ నిర్ణయం తీసుకుంది.  వైజాగ్ లోనే ఆంధ్రా యూనివర్సిటీకి గ్రౌండ్ లోఈవెంట్ జరగబోతున్నట్టు ప్రకటించింది. అంతే కాదు ఆంధ్రా యూనివర్సిటీ లో ఈవెంట్ కోసం  పోలీస్ పర్మీషన్ కూడా రావడంతో ఫిక్స్ చేస్తూ.. అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాలో మెగా స్టార్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.  


 

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?