
దిల్ రాజుకు ఇంగ్లీష్ భాషపై పట్టులేదు. ఏదో లిటిల్ బిట్ మేనేజ్ చేస్తారు కానీ... స్పీచ్ ఇచ్చేంత సీన్ లేదు. పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా ఆయనకు ఇంగ్లీష్ అవసరం ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో, వేరు వేరు భాషల మీడియా ప్రతినిధులతో మాట్లాడాలంటే ఇంగ్లీష్ ఓన్లీ మీడియం కాబట్టి. తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం రాకపోయినా ఇంగ్లీష్ తో ఎక్కడైనా మ్యానేజ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ చేసేది అదే. ఆ మధ్య రన్బీర్ కపూర్ తెలుగులో బ్రహ్మాస్త్ర ప్రమోట్ చేశాడు. ఆయన ఆద్యంతం ఇంగ్లీష్ లో మాట్లాడారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి ఇతర పరిశ్రమల్లో దాదాపు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఎన్టీఆర్ కి కన్నడ వచ్చు, రాజమౌళి తమిళ్, కన్నడలో కూడా ప్రావీణ్యం ఉంది.
దిల్ రాజుకు తెలుగు మినహాయించి ఇతర భాషలు రావు. ఇప్పుడదే ఆయనకు పెద్ద సమస్య అయి కూర్చుంది. వారసుడు(Varasudu) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఆ చిత్ర నిర్మాతగా ఉన్న దిల్ రాజు వేదికపై మాట్లాడాల్సి వచ్చింది. ఇంగ్లీష్, తమిళ్ భాషలు మిక్స్ చేసి ఆయన చేసిన ప్రసంగం నవ్వులు పాలైంది. ముఖ్యంగా దిల్ రాజు ఇంగ్లీష్ మొత్తంగా టాలీవుడ్ పరువు తీసింది.
ఇక దిల్ రాజు(Dil Raju) ఇంగ్లీష్ స్పీచ్ క్షణాల్లో వైరల్ అయ్యింది. మీమ్స్ రాయుళ్లకు పెద్ద మొత్తంలో మెటీరియల్ ఇచ్చాడు ఆయన. దాంతో వారు మీమ్స్, ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. దిల్ రాజు స్పీచ్ నవ్వులు పూయిస్తోంది. కాగా వారసుడు జనవరి 11న విడుదల కానుంది. విడుదలైన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియన్స్ మాత్రం పెదవి విరిచారు. గత పదేళ్లలో వచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల మిక్స్ అంటూ కొట్టిపారేశారు. తమిళ ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అయ్యారు.
విజయ్(Vijay) కి ఉన్న స్టార్డమ్ రీత్యా ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మూవీ సూపర్ హిట్ అవుతుంది. తెలుగులో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా... రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు.