
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ (Godfather). మలయాళ చిత్రం ‘లూసీఫర్’కు ఇది రీమేక్. దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ క్రమంలో చిరంజీవి మూవీని మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)తో లైవ్ చిట్ చాట్ సెషన్ నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి. పూరీజగన్నాథ్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తూ సినిమాకు సంబంధించిన ముఖ్య విషయాలపై చర్చించారు. ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.
ఇదే సమయంలో పూరీ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారని క్లారిటీ ఇచ్చారు. లైవ్ సెషన్ లో చివరిగా పూరీ, చిరు మాట్లాడిన మాటలు తర్వలోనే ఈ కాంబినేషన్ సెట్ కాబోతున్నట్టు తెలిపారు. గతంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి నటించాల్సి ఉంది. మెగాస్టార్ రీఎంట్రీ సందర్భంగా పూరీ ‘ఆటోజానీ’ పేరుతో ఓ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధంగా ఉంచారు. కానీ ఎందుకో అప్పుడు వీరి కాంబినేషన్ సెట్ కాలేదు. దీంతో అభిమానులు కూడా కాస్తా అప్సెట్ అయ్యారు. తాజాగా మళ్లీ తీపి కబురు చెప్పారు.
పూరీ దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తానని మాటిచ్చారు. ఇందుకోసం పూరీ కూడా ఆటోజానీని మించిన బలమైన కథతో చిరంజీవిని కలుస్తానని చెప్పారు. ఈసారి గట్టిగా కొడుదాం సార్ అంటూ పూరీ చెప్పిన మాటలు అభిమానుల్లో జోష్ ను నింపుతున్నాయి. హీరోయిజాన్ని తారా స్థాయిలో చూపించే పూరీ దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తే చూడాలని ఇప్పటికే అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరు, పూరీ ఊహించని విధంగా ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. అయితే గతంలోనే చిరు, పూరీ కాంబో పట్టాలెక్కబోయి తప్పింది. ప్రస్తుతం పూరీ మళ్లీ ఫ్లాప్స్ తో ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చిరు అవకాశం ఇస్తాడా అన్ని ప్రశ్నార్థకంగా మారింది.
కానీ చిరు, పూరీకి బూస్టప్ ఇస్తూ మాట్టాడిన మాటలు తప్పకుండా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే పూరీ గోవాకు తన టీంతో వెళ్లి స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారన్న సమాచారం. ఈ క్రమంలో చిరంజీవి కోసం కూడా కథను రెడీ చేసి ఉంటారని అంటున్నారు. ఇక ‘లైగర్’(Liger)తో పూరీకి ఊహించని దెబ్బ పడింది. సినిమా ఫ్లాప్ పైనా పూరీ స్పందించారు. సినిమా పోయిందని తెలియగానే కాస్తా అప్సెట్ అయ్యారని, కానీ నెగెటివ్ టాక్ ను బర్నింగ్ గా మార్చుకున్నాని తెలిపారు. ఏదేమైనా చిరు, పూరీ కాంబో సెట్ అవ్వబోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. గాడ్ ఫాదర్ లో పూరీ జగన్నాథ్ ‘గోవర్థన్’ అనే జర్నలిస్ట్ పాత్రలో నటించారు. సల్మాన్ ఖాన్ (Salman Khan), సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటించారు.