మెగాస్టార్ చిరంజీవి సినిమాను భారీ ఎత్తున ప్లాన్ చేశాడు దర్శకుడు వశిష్ట. విశ్వంభర కోసంభారీ సెట్లు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ అవి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే..?
చాలారోజులు గ్యాప్ తీసుకుని.. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈసినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. మెగాస్టార్ తో విజ్యువల్ వండర్ చేయబోతున్నాడు యంగ్ డైరెక్టర్. తాజాగా వచ్చిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈసినియా సోషియో ఫాంటసీ మూవీ కావడంతో.. సినిమాకోసం రకరకాల సెట్స్ ను ప్లాన్ చేశారు మూవీ టీమ్. అందుకు తగ్గట్టగానే భారీగా ఖర్చు చేస్తూ.. ఓ కొత్త ప్రపంచాన్ని సెట్ రూపంలో వేయబోతున్నాడట వశిష్ట.
మరీ ముఖ్యంగా ఈసినిమాలో స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సెట్‌లో మెగాస్టార్‌తో పాటు విలన్స్‌పై భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారట. అయితే ఈ సీక్వెన్స్‌లో చిరంజీవి గెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని యాక్షన్ విజువల్స్‌గా కూడా గూస్‌బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తుంది. ఇక సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. త్రిష దాదాపు 18 ఏండ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఈసినిమాలో నటిస్తుంది.
యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు 200 కోట్లతో బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక విశ్వంభర సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. మూవీని తీయ్యడం కూడా పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాడట వశిష్ట.