యానిమల్ టీమ్ కు రికార్డ్ ల కిక్కు..హిట్ మూవీ ఖాతాలో మరో ఘనత..

By Mahesh Jujjuri  |  First Published Feb 12, 2024, 2:31 PM IST

వరుసగా రికార్డ్ లు క్రియేట్ చేస్తూ వెళ్తోంది యానిమల్ మూవీ. రేర్ రికార్డ్స్ కు అతి చేరువలో ఉన్న ఈసినిమా .. తాజాగా మ్యూజిక్ పరంగా కొత్త రికార్డ్ నుతన ఖాతాలో వేసుకుంది. 
 


 బాలీవుడ్ న‌టుడు రణ్‌బీర్‌ కపూర్ హీరోగా న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘యానిమల్’.రిలీజ్ అయ్యే అవ్వడంతో బ్లాస్ట్ అయ్యింది యానిమల్ సినిమా.. బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది. యానిమల్ మూవీ  రిలీజైన ఫస్ట్ డే నుంచే  బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. తెలుగులో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన  దర్శకుడు  సందీప్ రెడ్డి వంగా  డైరెక్ట్ చేసిన ఈసినిమా థియేటర్లను దడదడలాడించి.. ప్రస్తుతం ఓటీటీలో కూడా దూసుకుపోతోంది.  ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ లో ఉంది. ఈసినిమా చాలా మందికి బాగా ఎక్కేసింది.. కిక్క్ ఇచ్చింది. 

కాని అదే టైమ్ లో ఈమూవీపై విమర్శలు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. కాని ఇష్టం లేదంటూనే సినిమాను విపరీతంగా చూస్తున్నారు జనాలు. కొన్ని రివ్యూస్ అయితే ధారుణంగా ఇచ్చేస్తున్నారు. ఇక ఓటీటీలో కూడా భారీ వ్యూస్ తో కొనసాగుతున్న యానిమల్ సినిమా  బయట థియేటర్లలో కూడా ఇంకా నడుస్తూనే ఉంది. ఇక అసలు విషయం ఏంటంటే.. యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర  సెన్సేషన్ రికార్డ్ కి చేరువలో ఉంది. అది కూడా ఇక్కడ కాదు యూఎస్ లో. అవును ఇండియాలో దూసుకుపోతున్న ఈసినిమా.. యూఎస్ మార్కెట్ లో అంతకు మించి దూసుకుపోతోంది.  

Latest Videos

యానిమల్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 900 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. కాగా ప్ర‌స్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాలోని పాట‌లు ఎంత బిగ్ హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులోని ప్రతిపాట ఒక చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. అయితే  తాజాగా ఈ సినిమాలోని పాట‌లు అరుదైన రికార్డు క్రియేట్ చేశాయి. ఇప్పటికే  యూఎస్ లో బాహుబలి కలెక్షన్ రికార్డ్ కు దగ్గరగా ఉన్నఆనిమల్.. ఆ రికార్డ్ టచ్ చేయకముందే మ్యూజిక్ పరంగా మరో ఘనత సాధించింది. 

ప్ర‌ముఖ మ్యూజిక్ యాప్ స్పాటిఫైలో  యానిమల్ ఆల్బమ్ 500 మిలియన్స్ కి పైగా స్ట్రీమ్ అయ్యింది. ఇక స్పాటిఫైలో అత్యంత వేగంగా ఈ నంబర్‌ను చేరుకున్న చిత్రంగా యానిమల్ నిలిచింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంకి సంబందించి యానిమ‌ల్ పార్క్‌ సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

click me!