
తెలుగు సినీ దర్శకులపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి షాకింగ్ కామెంట్ చేశారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా' చిత్రం తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. టాలీవుడ్ డైరెక్టర్స్ టార్గెట్‌గా కీలక వ్యాఖ్యాలు చేశారు. షూటింగ్ స్పాట్‌కు వచ్చాక డైరెక్టర్స్ డైలాగ్‌లు రాసిస్తున్నారని... ఇది నటులకు చాలా ఇబ్బంది కలిగించే అంశమని చెప్పారు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. డైరెక్టర్స్ స్క్రిప్ట్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని.. మరింతగా శ్రమించాలని చురకలు అంటించారు.
డైరెక్టర్స్ ముందే స్క్రిప్ట్ ఇస్తే ఫెర్మామెన్స్‌పై దృష్టి పెడతారని చిరంజీవి చెప్పారు. టాలీవుడ్ డైరెక్టర్స్ తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలతో పాటుగా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఆచార్య సినిమా ఫెయిల్యూర్‌కు సంబంధించి దర్శకుడు కొరటాల శివను ఉద్దేశించి.. చిరంజీవి ఈ కామెంట్స్ చేసి ఉంటారని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు.