
ఈ రోజున సినిమా రిలీజ్ అయ్యిందంటే ట్విట్టర్ లో వరస పోస్ట్ లు పడిపోతున్నాయి. అవి కొన్ని నెగిటివ్ గా ఉంటాయి. మరికొన్ని పాజిటివ్ గా ఉంటాయి. చాలా సార్లు ట్వీట్ రివ్యూలతో సినిమా రిజల్ట్ మార్నింగ్ షో కన్నా ముందే బయిటకు వచ్చేస్తోంది. అది కలెక్షన్స్ పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడుతోంది. అదే సమయంలో చాలా సినిమాలకు ఈ ట్వీట్స్ ఊపు తెప్పించాయి. సినిమా బాగుందని సోషల్ మీడియాలో బజ్ వస్తే ఖచ్చితంగా చాలా మంది వెళ్లి చూస్తున్నారు. ఇవన్ని సినిమావాళ్లంతా గమనిస్తూంటారు. కానీ ఎవరూ కామెంట్స్ చేయరు. ఎందుకంటే తమ సినిమాలను ప్రమోట్ చేసే దివాళ్లే అని తెలుసు. కానీ రామారావు ఆన్ డ్యూటీ ప్రమోషన్ లో డైరక్టర్ శరత్ మండవ కాస్త మీరి వాళ్ల మీద కామెంట్స్ చేసారు.
'ట్విట్టర్‌లో ట్వీట్లు చూడకండి.. థియేటర్లో సినిమా చూడండి.. ట్విట్టర్‌లో పిట్టలు రెట్టలు మాత్రమే వేస్తాయి. వాళ్లెవ్వరూ కూడా మంచి ట్వీట్లు వేయడం లేదు. సినిమాను చూడండి.. మీకు నచ్చుతుంది.. నచ్చకపోతే రెండు గంటలకు మీకే తెలుస్తుంది. ట్విట్టర్ చూసి సినిమాకు వెళ్లడం మానేస్తే మనం బాగు పడతాం.. థియేటర్లు బాగుపడతాయ్ ’ అని అన్నారు.
ట్విట్టర్ లో రెట్టలు అనే మాట చాలా మంది కి కోపం తెప్పిస్తోంది. మంచి సినిమా చేస్తే వాళ్లే ప్రమోట్ చేస్తారు కదా..అది గమనించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారు. అయినా ట్విట్టర్ లో రివ్యూలు మీద రిలీజ్ కాకుండా భయపడమెందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదైమైనా ఇదొక ఇష్యూగా మారింది. శరత్ మండవ అతి చేసాడంటున్నారు.
టిక్కెట్ రేట్లు గురించి మాట్లాడుతూ.... ‘ఈ ప్రాజెక్ట్ ఇంత దూరం రావడానికి కారణం రవితేజ గారు. ఆయనకు థ్యాంక్స్. ఇంత వరకు ఆయనకు ఈ మాట చెప్పలేదు. ఇలాంటివి ఆయన అంగీకరించరు. ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. నేను ఆయనకు ఫ్యాన్‌ని. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని జనాలు థియేటర్లకు రావడం లేదట.
ఇందులో ఎంత నిజముందో నాకు తెలియదు. కానీ మా సినిమా టికెట్ రేట్లు చెబుతాను. తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో రూ. 195, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.150, రూ.100, రూ.50గా ఫిక్స్ చేశాం. ఏపీలో అయితే రూ. 177, రూ.147, రూ.80గా ఫిక్స్ చేశారు. అయితే ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే రూ. 30 ఎక్కువగా తీసుకుంటారు. అలా మధ్యలో వాళ్లకి డబ్బులు ఇవ్వకండి.. కొంచెం కష్టమైనా కూడా థియేటర్‌కు వెళ్లి కౌంటర్‌లో టికెట్ తీసుకోండి’ అని అన్నారు.