
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు తదుపరి మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ లో నటించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ లు రెడీ అవుతున్నాయి. చిరంజీవి 153 లూసిఫెర్ రీమేక్ టీం కూడా ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు రెడీ అవుతోంది.
'బాస్ ఆఫ్ మాసెస్ మెగాస్టార్ చిరంజీవి సుప్రీం రివీల్' అంటూ చిత్ర యూనిట్ ఓ అప్డేట్ వదిలింది. ఆగష్టు 21 సాయంత్రం 5:04 గంటలకు సుప్రీం రివీల్ అని ప్రకటించారు. మెగాస్టార్ కి ముందు చిరంజీవి బిరుదు సుప్రీం హీరో. ఇక్కడ సుప్రీం రివీల్ అందంతో ఏమై ఉంటుంది అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఆచార్య చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కరోనా ప్రభావం, ఏపీలో థియేటర్స్ సమస్యతో ఆచార్య రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు. దసరా, సంక్రాంతి రేస్ లో నిలుస్తోంది అంటూ ఊహాగానాలు మాత్రం వైరల్ అవుతున్నాయి.