అసలు సీక్రెట్ చెప్పిన చిరంజీవి, మెగా ఫ్యామిలీ నుంచి అంత మంది హీరోలు రావడానికి కారణం ఏంటీ...?

Published : Apr 27, 2022, 03:24 PM IST
అసలు సీక్రెట్ చెప్పిన చిరంజీవి, మెగా ఫ్యామిలీ నుంచి అంత మంది హీరోలు రావడానికి కారణం ఏంటీ...?

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి తరువాత.. ఆ ఫ్యామిలీ నుంచి దాదాపు 10 మందికి పైగా హీరోలు తయారయ్యారు. ఇండస్ట్రీలో అది కూడా సౌత్ లో ఎక్కవ మంది హీరోలున్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. మరి మెగా ఫ్యామిలీలో ఇంత మంది హీరోలు తయరవ్వడానికి కారణం ఏంటీ..? ఈ సీక్రెట్ ను రీసెంట్ గా రివిల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. 

మెగాస్టార్ చిరంజీవి తరువాత.. ఆ ఫ్యామిలీ నుంచి దాదాపు 10 మందికి పైగా హీరోలు తయారయ్యారు. ఇండస్ట్రీలో అది కూడా సౌత్ లో ఎక్కవ మంది హీరోలున్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. మరి మెగా ఫ్యామిలీలో ఇంత మంది హీరోలు తయరవ్వడానికి కారణం ఏంటీ..? ఈ సీక్రెట్ ను రీసెంట్ గా రివిల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. 

ప్రస్ధుతం ఆచార్య రిలీజ్ హడావిడిలో ఉన్నారు మెగాటీమ్ అంతా. మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆచార్య ప్రమోషన్స్ లో మునిగితేలుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్రవారం( ఏప్రిల్ 29)న రిలీజ్ కాబోతోంది ఆచార్య. సోషల్ మీడియాతో    పాటు స్పెషల్ ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతో బిజీ బిజీ గా గడిపేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చిరు. 

ఆచార్య ప్రమోషన్లలో బాగంగా రీసెంట్ గా  ఓ ఇంగ్లీష్ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు చిరంజీవి  ఈ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్ తో స్క్రీన్ పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఆచార్య’ తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. సౌత్ లో తన కుటుంబం నుంచే ఎక్కువ మంది హీరోలు ఉన్నారని. దానికి ఓ ప్రత్యేక కారణం ఉందని అన్నారు. 

హిందీలో మాదిరిగా సౌత్ లో తన కుటుంబం కపూర్ ఫ్యామిలీ కావాలనుకున్నానని చిరూ పేర్కొన్నారు. హిందీలో కపూర్ కుటుంబానికి ఓ ప్రాధాన్యం ఉందని, ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లంతా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారని చెప్పారు. వారికున్న పేరు, ఫేమ్ ను చూసి తనకెంతో ముచ్చటేసిందని తెలిపారు. అందుకే తన కుటుంబం కూడా సౌత్ లో కపూర్ ఫ్యామిలీ లా ఎదగాలనుకుంటున్నట్టు మెగాస్టార్ కొరిక  అన్నారు. ఈ విషయాన్ని తాను  పవన్ కల్యాణ్ తో చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు. 

ఈ రోజు పవన్ నుంచి అల్లు అర్జున్ దాకా తన కుటుంబం నుంచి వచ్చిన వారంతా హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, కెరీర్ లో ఎత్తుపల్లాలతో తమకంటూ సొంత స్టార్ స్టేటస్ ను తెచ్చుకున్నారని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. అయితే తన కుటుంబం నుంచి వచ్చిన వారు తమకు తా ముగా సొంత టాలెంట్ తో స్టారో ఇమేజ్ తెచ్చుకున్నారని.. అది తనకు  ఎంతో సంతోషానిచ్చిందన్నారు మెగాస్టార్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో