
విజయదశమి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గరికపాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. గరికపాటి వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన పెద్దాయన.. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కాగా... వివాద విషయంలోకి వెళితే... దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అలయ్ బలయ్‌కు వచ్చిన చిరంజీవితో అభిమానులు ఫోటోలు దిగారు.
మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు చిరంజీవితో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.
ALso Read:గరికపాటి నుంచి క్షమాపణలు కోరలేదు.. ఆ మాటలపైనే బాధ, మెగా ఫ్యాన్స్ తొందరపడొద్దు : నాగబాబు
'అక్కడ మొత్తం ఫోటో సెషన్ ఆగిపోవాలి. నాకేం మోహమాటం లేదు. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి' అంటూ వెళ్లిపోతా' అంటూ గట్టిగానే చెప్పారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు సర్ధిచెప్పారు. అంతేగాక సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని చెప్పారు. ఒకరోజు తమ ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని చిరంజీవి ఆహ్వానించారు.
మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి నరసింహా రావుపై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారని జనాలు భావిస్తున్నారు. ''ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే'' అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ప్రముఖ ప్రవచనకర్తను ఉద్దేశించి చేసినదేనని భావిస్తున్నారు. చిరంజీవిపై సీరియస్ అయిన గరికపాటిని ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జోరుగా సాగుతోంది.