సంవత్సరీకం రోజున తండ్రిని గుర్తు చేసుకున్న చిరు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Published : Dec 24, 2022, 02:21 PM IST
సంవత్సరీకం రోజున తండ్రిని గుర్తు చేసుకున్న చిరు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవికి తన తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు 2007లో మరణించారు.

మెగాస్టార్ చిరంజీవికి తన తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు 2007లో మరణించారు. నేడు ఆయన వర్ధంతి. తండ్రి సంవత్సరీకం సందర్భంగా చిరు ట్విటర్ లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

'మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో  పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల  అవగాహన పంచి, మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన  మా తండ్రి వెంకట్రావు గారిని  ఆయన సంవత్సరీకం సందర్బంగా స్మరించుకుంటూ.. ' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

సవత్సరీకం సందర్భంగా తండ్రికి నివాళులు అర్పిస్తూ పూజ చేస్తున్న ఫోటోలని కూడా చిరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి దంపతులు, తల్లి అంజనా దేవి, చెల్లెల్లు, నాగబాబు ఉన్నారు. పవన్ పూజలో పాల్గొన్నట్లు లేదు. బహుశా షూటింగ్ తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ చిరు తన ఫ్యామిలీ మొత్తం తండ్రితో ఉన్న బ్యూటిఫుల్ త్రో బ్యాక్ పిక్ ని కూడా పంచుకున్నారు. 

ఈ ఫొటోలో వింటేజ్ పవన్ కళ్యాణ్ కింద కూర్చుని ఇస్తున్న ఫోజులు ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నోడు ఎక్కడైనా స్పెషల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌